ఆంధ్రప్రదేశ్‌

రోగాలకు ఏపీ హెడ్‌క్వార్టర్‌గా మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: రోగాలకు ఆంధ్రప్రదేశ్ హెడ్‌క్వార్టర్స్‌గా మారిందని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ గిరిజన ప్రాంతంలో ఆంత్రాక్స్ ప్రబలడంపై సోమవారం ఆయన ప్రశ్నించారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ, పశువులకు అంత్రాక్స్ సోకిన కేసులు 2, మనుషులకు సోకిన కేసులు 14 నమోదు అయ్యాయని వివరించారు. దీనిపై టీకాలు వేసినా ఆంత్రాక్స్ ఎందుకు వస్తుందంటూ మూర్తి ప్రశ్నించారు. రోగాలకు ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో ఒక నెలకు సంబంధించి 6960 జ్వరాల కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇందులో 2185 మలేరియా కేసులని, 12 డెంగ్యూ కేసులు ఉన్నాయన్నారు. శిశు మరణాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నామన్నారు. హైపర్ టెన్షన్‌లోనూ ముందు ఉన్నామన్నారు. విశాఖ ఎంవిపి రైతు బజారుకు వెళ్లి కుక్కలు తరమకుండా తిరిగి రాగలితే, మండలిలో ఇక తాను ప్రశ్నలు వేయబోనని చలోక్తి విసిరారు. నెలకు 400 కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇన్ని జరుగుతుంటే మంత్రిని అభినందించకుండా ఉండలేమన్నారు.