ఆంధ్రప్రదేశ్‌

రూ.250 కోట్లతో ఆదరణ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన చేతివృత్తుల వారికి అధునాతన మెరుగైన చేతి పనిముట్లు కిట్లను సమకూర్చడం కోసం తొలుత రూ.250 కోట్ల అంచనా వ్యయంతో ఆదరణ పథకాన్ని అమలుచేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు కాగిత వెంకట్రావు, బి.అశోక్ తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ వివిధ పథకాల ద్వారా బిసి వర్గాలకు సహాయాన్ని అందించేందుకై ప్రస్తుత బడ్జెట్‌లో 11 బిసి సమాఖ్యలకు రూ.295.91 కోట్లు, ఎంబిసి కార్పోరేషన్‌కు రూ.60 కోట్లు, బిసి సహకార ఆర్థిక సహాయ సంస్థకు రూ.666 కోట్లు కేటాయించామన్నారు. మారుతున్న కాలానుగుణంగా రాష్ట్రంలో కులవృత్తులు అంతరించిపోతున్నాయంటూ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె.రవికుమార్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. కుల, చేతి వృత్తిదారులకు కష్టాలు వస్తున్నాయని అన్నారు. చేనేత మగ్గంపై భార్యాభర్తలు రోజంతా కూర్చున్నా రూ.200లు మించి దక్కడం లేదన్నారు. యాంత్రీకరణ వల్ల మట్టిపాత్రలు, అల్యూమినియం పాత్రలు మటుమాయమైపోయాయని అన్నారు. అందుకే వివిధ వృత్తుల్లో సాంకేతిక నైపుణ్యత అందించాల్సి ఉందన్నారు.