ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించామని, దీనిపై ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం తెలిపారు. భారీ వర్షాల వల్ల సంభవించిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు వివిధ రంగాలను పునరుద్ధరించే నిమిత్తం వివిధ చర్యలు చేపట్టేందుకు గాను రూ.845 కోట్లు సహాయం కోరినట్లు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బిసి జనార్ధనరెడ్డి, బి.అశోక్, డాక్టర్ బి.జయనాగేశ్వరరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు చినరాజప్ప పై విధంగా బదులిచ్చారు. 44వేల 495 హెక్టార్లలో 33 శాతానికి పైబడి వ్యవసాయ పంటలు, 4004 హెక్టార్లలో 33 శాతానికి పైబడి ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. సభ్యులు శివాజీ మాట్లాడుతూ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా దీనిపై అధికారులు అంచనాలు వేస్తున్నారని చెప్పారు. బీమా కంపెనీలు బాధిత రైతాంగానికి సహాయ పడటం లేదని పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు.