ఆంధ్రప్రదేశ్‌

ప్రతి గ్రామంలో వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 20: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సోమవారం శాసనసభలో ఉపాధి హామీ పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా 16వేల 200 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గడచిన మూడున్నరేళ్లలో రూ. 9747 కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. మరో ఏడాది కాలంలో సెవెన్ స్టార్ రేటింగ్ ప్రణాళికతో గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. ఇందులో ప్రతి ఇంటికీ విద్యుత్, వంట గ్యాస్ కనెక్షన్, వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీలకు భవనాలు, చెరువులను పటిష్టపరచి మొక్కలు నాటటం, ఆపై ప్రతి కుటుంబానికి రూ. 10వేల ఆదాయం వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. 2019 నాటికి రాష్ట్రంలోని 12వేల 918 పంచాయతీలు సెవెన్‌స్టార్ రేటింగ్ సాధించాలనేదే ఈ ప్రణాళిక లక్ష్యమన్నారు. ఫ్లోరైడ్ పీడిత 440 గ్రామాల్లో మంచినీటికి రూ 1711 కోట్లు కేటాయించామన్నారు. మరో 6197 గ్రామాలకు రక్షిత నీటి పథకం అమలులో ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో 150 కోట్లతో 900 గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద 107 క్లస్టర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఎన్‌ఎస్‌సి కార్డు ద్వారా వాటర్ డిస్పెన్సరీలను ఏర్పాటుచేసి 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. రాయలసీమ వాటర్ వే పథకంలో భాగంగా భూగర్భంలో ఉన్న జలాలను వెలికితీసి అన్ని గ్రామాలకు మంచినీరందించే ప్రయత్నాలు చేస్తున్నామని తంబళ్లపల్లిలో ప్రయోగాత్మకంగా రూ. 13 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తామని వివరించారు. ఇది విజయవంతమైతే సీమకు నీటి కష్టాలు ఉండవన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పూర్తిస్థాయిలో చేపట్టి గ్రామాల్లో కాలుష్య రహిత వాతావరణం ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా చెప్పారు. వ్యర్థపదార్థాల నిర్వహణ ప్రాజెక్టు కింద 450 గ్రామాల్లో వర్మీకంపోస్టులు ఏర్పాటవుతాయని ఐదువేల మందికి పైగా జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. వచ్చే ఏడాది నవంబర్ 2లోగా 30లక్షల ఎల్‌ఈడి బల్బులు అందిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం వేతనాలు పెంచే విషయమై కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై స్పందించారు. ప్రతిపక్షాలు ఓర్వలేకే నిందలు మోపుతున్నాయని ఉపాధి హామీ నిధులను అడ్డుకుని పేదల కడుపు కొడుతున్నాయన్నారు. వైసీపీ నిర్వహించే పాదయాత్రలో నిజాలు తెలియడంలేదా అని ప్రశ్నించారు.