ఆంధ్రప్రదేశ్‌

విమర్శలు వస్తాయనుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఈ స్థాయిలో విమర్శలు వస్తాయని భావించలేదని సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు వస్తాయనుకుంటే ఐవీఆర్‌ఎస్‌తో సర్వే చేయించి ఉండేవాళ్లమన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన వ్యూహబృందంతో సోమవారం నిర్వహించిన సమావేశంలో నంది అవార్డుల ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా ఆయన అవార్డులతో సహా అన్ని విషయాలకూ కులం రంగు పులమడం సరైంది కాదన్నారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులిచ్చామే తప్ప, సొంత నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘అది మనకేం సంబంధం? జ్యూరీలో సినిమావాళ్లనే వేశాం కదా? అసలు ఇవ్వకపోతే ఎవరేం అడుగుతారు? ఇచ్చిన తర్వాత కులాల గురించి రచ్చ చేయడం బాధ కలిగించింది. హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడుతున్నారు. అందుకే బాధ వేసి ఓ సీనియర్ జర్నలిస్టుతో నా ఆవేదన పంచుకున్నా. ఆ తర్వాతనే ఆ విమర్శలు తగ్గాయ’ని వ్యాఖ్యానించారు. కాగా ఇకపై అంశాల వారీగానే మాట్లాడాలని బాబు ఆదేశించారు. జగన్ పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ ఆయన పాదయాత్రను ప్రజలే పట్టించుకోనప్పుడు, పార్టీపరంగా మనం స్పందించాల్సిన అవసరం లేదని, జగన్, వైసీపీ వాదనలను కోర్టు కూడా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.