ఆంధ్రప్రదేశ్‌

గరుడ వాహనంపై చైతన్య స్వరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం రాత్రి అమ్మవారు గరుడ సేవ వైభవంగా జరిగింది. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.
జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహనసేవలో అలమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది. ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్థనుడి అవతారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. వాహన సేవ అనంతరం అమ్మవారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
గరుడ సేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పుసుపుమండపం వద్దకు తీసుకొచ్చారు. గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుపుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుకు పాదుకలను పంపుతున్నారని పురాణ ఇతిహాస్యం.
స్వర్ణరథంపై మెరిసిన లోకమాత
సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4.10 నుంచి 5 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. కాగా రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.