ఆంధ్రప్రదేశ్‌

ధర్మస్థాపనకు మార్గం వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 20: ధర్మస్థాపనకు వేదం మార్గమని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. భగవాన్ సత్యసాయి బాబా 92వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పుట్టపర్తిలో జరిగిన అంతర్జాతీయ వేద సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ప్రసంగిస్తూ వేదాలకు భారతదేశం పుట్టినిల్లు అన్నారు. భిన్న సంస్కృతులు, భిన్న మతాలకు భారతదేశం నిలయమన్నారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ బహుళ మతప్రార్థనలు, వేద పారాయణం జరుగుతున్న సత్యసాయి నిలయం ప్రపంచ శాంతికి ఆలవాలమన్నారు. భారతదేశం వేదభూమి అని, భిన్న సంప్రదాయాలు, మతాలను కలబోసుకున్న అవని అని అన్నారు. మొక్కలకు వేర్లు ఎంత ముఖ్యమో ధర్మానికి, సమసమాజ స్థాపనకు వేదాలు అంతే ముఖ్యమన్నారు. వేదాలు కల్పవృక్షంలాంటివన్నారు. ధర్మస్థాపన, వేద అధ్యయనం, సాధనతోనే సాధ్యపడుతుందన్నారు. అజ్ఞానమనే చీకటిని పారదోలి జ్ఞానమనే వెలుగును నింపేందుకు వేదం అనుసరనీయమని, ఆచరణీయ మార్గమన్నారు. యోగా, ప్రాణాయామం ఎంత ముఖ్యమో వేదాలు, వేద పారాయణం మనిషి దైనందిన జీవితంలో అంతే ముఖ్యమన్నారు. ఆనందం, సంతోషం, జ్ఞానాన్ని మనుషులు ఒకరితోఒకరు పంచుకోవడంలోనే సార్థకత ఇమిడి ఉందన్నారు. అహాన్ని వీడి ఇతరులతో సోదరభావం, ప్రేమతో మెలగడం అలవరుచుకోవాలన్నారు. మనమంతా ఒకే కుటుంబం, మతాలు వేరైనా అందరి అభిమతం ఒక్కటేనన్నారు. వేదపారాయణం వల్ల మనిషిలో ఏదో తెలియని దివ్య అనుభూతి తప్పక కలుగుతుందన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస అనే సనాతన ధర్మాలను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. మాతృదేవో భవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ అన్న సూక్తులను తప్పక ఆచరించాలన్నారు. అసత్యం, హింసను వీడి ధర్మాన్ని పాటించాలన్నారు. సు..దర్శన్ అనేది మంచి మార్గంతో పయనించడమేనన్నారు. సర్వమతాలు సమానత్వమని ఎన్ని పేర్లతో పిలిచినా పలికే దైవత్వం ఒక్కటేనని భగవాన్ సత్యసాయి బాబా చాటిచెప్పిన మార్గం అందరికీ అనుసరనీయమన్నారు. ఇటువంటి మహత్తరమైన అంతర్జాతీయ వేద సమ్మేళనం ఇక్కడ జరగడం, తాను హాజరుకావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారి తన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందన్నారు. జీవితంలో నీవెప్పుడు తప్పు చేయవద్దు అని భగవాన్ బాబా తనకు చెప్పిన మాటను మననం చేసుకుంటుంటానన్నారు. సత్యసాయి ప్రవనలాకు ఆకర్షితులైన కోట్లానుమంది భక్తులు ఆయన శిష్యులుగా మారారన్నారు. 42 దేశాలకు చెందిన విభిన్న మతాల గురువులు, 15వేల మంది సత్యసాయి బాలవికాస్ విద్యార్థులు, ప్రముఖులు ఈ అంతర్జాతీయ వేద సమ్మేళనానికి హాజరయ్యారు.

సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న గవర్నర్
గవర్నర్ నరసింహన్ సోమవారం పుట్టపర్తి సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న అంతర్జాతీయ వేద సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ప్రశాంతినిలయంలో సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావు, చక్రవర్తి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సమాధి వద్ద ప్రణమిల్లి భక్తిప్రపత్తులను చాటుకున్నారు.