ఆంధ్రప్రదేశ్‌

తెలుగు అమలుపై ప్రకటన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: నిర్దిష్ట గడువులోగా తెలుగు భాష అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని చాటుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట గత 20 రోజులుగా జరుగుతున్న నిరసన దీక్షలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల అమల్లో ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలుగు భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా గత మూడేళ్లుగా ఆగస్టు 29న తెలుగు భాష ఔన్నత్యం, భాషను బతికించుకోవడంపై ప్రసంగించే ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలనలో ప్రభుత్వ పర కార్యక్రమాల్లో తెలుగు అమలు కాకపోవడంపై సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నిత్యం మంత్రులు, అధికారులతో ప్రభుత్వ కార్యక్రమాలపైన, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో పార్టీ కార్యక్రమాలపై విస్తృత సమీక్షలు జరిపే చంద్రబాబు గత 20 రోజులుగా తెలుగు భాషను బతికించుకునేందుకు విశాఖలో జరుగుతున్న ఉద్యమంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒకటి నుంచి ఇంటర్ వరకూ తెలుగు పాఠ్యాంశం తప్పనిసరి చేయగా, ప్రభుత్వమే మున్సిపల్ పాఠశాలల్లోను, అంగన్‌వాడీల్లోను ఆంగ్ల మాథ్యమాన్ని అమలు చేయాలని చూడటం దారుణమన్నారు. కేంద్రం పథకాలకు సంబంధించి శిలాఫలకాల్లో హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషలను తప్పనిసరిగా చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలను ఇంగ్లీషులో వేయడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా పేర్కొన్నారు. తెలుగు భాషను, తెలుగు జాతిని విస్మరిస్తే చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తెలుగు జాతికి, భాషకు జవసత్వాలు చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చిత్రం..దీక్షలో పాల్గొన్న యార్లగడ్డ లక్షీప్రపసాద్