ఆంధ్రప్రదేశ్‌

దేవాలయ భూముల రిజిస్ట్రేషన్ల నిషేధంపై శాసనసభలో రచ్చ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: దాదాపు 70 ఏళ్లుగా క్రయ విక్రయాలతో లక్షలాది మంది ప్రజలు అనుభవిస్తూ వస్తున్న హిందూ దేవాలయాలకు చెందిన ఇనామ్ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చి ఏడాది కాలంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయటమే గాక సంబంధిత భూములన్నింటినీ స్వాధీనపర్చుకోటానికి దేవాదాయశాఖ అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అడిగిన ప్రశ్నపై దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సమాధానమిస్తూ 2013లో జరిగిన దేవాదాయ చట్ట సవరణ ప్రకారం ఇనామ్ భూముల క్రయ విక్రయాలు చెల్లనేరవని 2016లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అధికారులు భూముల స్వాధీనం కోసం చర్యలు చేపట్టారని అన్నారు. రాజమండ్రి శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిన చందంగా..’ భూములు సంగతి సరే ఇళ్లల్లో నివసిస్తున్న వారిని బైటికి గెంటివేసే ప్రయత్నం చేస్తుంటే వారంతా తమ వద్దకు వస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆ ఇనామ్ భూముల్లో వేల సంఖ్యలో గృహాల నిర్మాణం ప్రభుత్వపరంగా విద్యుత్, రోడ్లు వంటి వౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తుచేశారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావు కల్పించుకుంటూ తరతరాలుగా స్వాధీనంలోనున్న భూములను వెనక్కి తీసుకోవాలనుకోటం కూడా సరైంది కాదు.. అలాగే దేవాదాయ శాఖ నష్టపోరాదు ఉభయతారకంగా ఒకరేటు నిర్ణయించి రెగ్యులరైజ్ చేసేలా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. సభ్యులు ఆనందరావు , బాల వీరాంజనేయస్వామి, పెందుర్తి వెంకటేష్ , తదితరులు మాట్లాడుతూ ఏది ఏమైనా సిఎం చంద్రబాబు తగు నిర్ణయం తీసుకుని హైకోర్టులో వివాదం పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.