ఆంధ్రప్రదేశ్‌

దివిసీమ ఉప్పెన చిత్రాలతో ఫొటో ఆల్బం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: చరిత్రకు చిత్రిక పట్టి భవిష్యత్తు తరాలకు తెలియజేయడంలో ఫొటోగ్రఫీ పాత్ర ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నలభై ఏళ్ల నాడు దివిసీమలో మరణ మృదంగం మోగించి ప్రళయం సృష్టించిన పెను విలయం ఉప్పెనపై ప్రముఖ ఛాయాచిత్రకారుడు సేకరించి సంకలనం చేసిన ఛాయాచిత్ర మాలిక ‘నేచర్స్ ఫ్యూరీ, రి విజిటింగ్ ది టైడల్ వేవ్ 1977’ను ముఖ్యమంత్రి మంగళవారం శాసనసభలోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అలనాటి దివిసీమ ఉప్పెనకు ప్రత్యక్షసాక్షి, నాటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు తనయుడు, నేటి శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు డా పరకాల ప్రభాకర్, మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కొనకళ్ల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..దివిసీమ ఉప్పెన ఛాయాచిత్రాల ఆల్బమ్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు