ఆంధ్రప్రదేశ్‌

రాఘవేంద్రుని సన్నిధిలో సూపర్‌స్టార్ రజనీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, నవంబర్ 21: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ వచ్చారు. మంగళవారం మంత్రాలయం చేరుకున్న ఆయనకు మఠం అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. తొలుత గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్న రజనీకాంత్ అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు రజనీకి స్వామివారి శేషవస్త్రం, ఫల మంత్రాక్షితలు, జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మఠంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులుతో కలిసి రజనీకాంత్ సందర్శించారు. జగద్గురువులు శ్రీరాఘవేంద్రస్వామి స్వహస్తాలతో రచించిన తాళపత్ర గ్రంథాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మఠం సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక సిబ్బంది బిందుమాధవ్, గోపీస్వామి, సిఐ రాము పాల్గొన్నారు.

చిత్రం..రజనీకాంత్‌కు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేస్తున్న పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు