ఆంధ్రప్రదేశ్‌

హోంగార్డుల సర్వీసును క్రమబద్ధం చేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హోంగార్డుల సర్వీసులను రెగ్యులరైజేషన్ చేయటం ఏ మాత్రం సాధ్యపడదని హోంమంత్రి చినరాజప్ప శాసనసభలో స్పష్టం చేశారు. అయితే వారి వేతనాల పెంపుపై ఆలోచిస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసులకు నిర్ణీత విధుల్లోనే కనీసం పనిదినాలు.. పని గంటలు ఉన్నాయి.. అయితే రాత్రి పగలు అన్ని రకాల విధులను నిర్వర్తిస్తూ వెట్టిచాకిరీ చేస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు అమలు జరగటం లేదంటూ సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో బిజెపి ఫ్లోర్‌లీడర్ పి విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్న ప్రకంపనలను సృష్టించింది. 1948లో ఏర్పాటైన చట్టం ప్రకారం ఈ హోంగార్డుల వ్యవస్థను ఓ వాలంటీర్ ఆర్గనైజేషన్‌గా పేర్కొనటం వలనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతుండగా 2015, జూలై 21తేదీన లోక్‌సభలో జరిగిన ఓ చర్చలో నాటి కేంద్ర హోం మంత్రి ఆ పదజాలాన్ని తొలగించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న 15వేల మంది హోంగార్డుల గురించి పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడంటూ విష్ణుకుమార్‌రాజు నిప్పులు చెరిగారు. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో చంద్రబాబు తన పాదయాత్రలో హోంగార్డులను రెగ్యులరైజేషన్ చేస్తానని హామీనిస్తూ ఆమేర ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చారన్నారు. దీంతో అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేస్తూ ప్రధాని మోదీ ప్రత్యేక హోదా.. ఆపై ప్రత్యేక ప్యాకేజీ అన్నారు అవి ఏమయ్యాయంటూ ఎదురుదాడికి దిగారు. దీనిపై విష్ణు స్పందిస్తూ హోంగార్డుల సమస్యను తానేమీ రాజకీయం చేయటం లేదన్నారు. ఇదే హోంగార్డులకు నెలకు కేరళలో రూ.600, తమిళనాడులో రూ.560, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.570లు, అతి చిన్న రాష్ట్రం గోవాలో రూ.620లు చెలిస్తున్నారన్నారు. పైగా సుప్రీంకోర్టు 2015లోనే సాధారణ పోలీసులకు అందించే బేసిక్‌తోపాటు ఇతర భత్యాలు ఇవ్వాలని ఆదేశించిందని గుర్తు చేస్తూ, కనీసం ఆ మేర చెల్లింపులైనా జరగాలన్నారు. దీనికి హోం మంత్రి చినరాజప్ప సమాధానమిస్తూ హోంగార్డులను రెగ్యులరైజేషన్ చేయటం సాధ్యపడదని స్పష్టం చేశారు. వేతనాల పెంపుపై పరిశీలిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోంగార్డులకు రోజువారీ భత్యం రూ.300లు మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.400లకు పెంచామన్నారు. అలాగే ఏడాదికోసారి చెల్లించేవారి ఏకరూప దుస్తుల భత్యాన్ని కూడా అదే తేదీ నుంచి వెయ్యి నుంచి రూ.1500లకు పెంచామన్నారు. అదనంగా కవాతుకు హాజరైనప్పుడు రోజుకు రూ.28, వాషింగ్ అలవెన్స్ కింద రూ.25 చెల్లిస్తున్నారన్నారు. 2017-18 బడ్జెట్‌లో హోంగార్డుల జీతభత్యాల కోసం రూ.163 కోట్లు కేటాయించామని, విధి నిర్వహణలో మరణించినవారికి రూ.5 లక్షలు లభించేలా బీమా సదుపాయాన్ని కల్పించామన్నారు.