ఆంధ్రప్రదేశ్‌

అరకు ఎంపీ గీతకు బెదిరింపు మెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 22: విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతను బెదిరిస్తూ ఒక మెయిల్ వచ్చింది. ఎం.జి.కృష్ణ అనే వ్యక్తి నుంచి ఈ మెయిల్ తనకు వచ్చినట్టు ఎంపీ గీత ‘ఆంధ్రభూమి’కి బుధవారం తెలియచేశారు. ఈ మెయిల్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీ గీతకు సంబంధించిన మొత్తం ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ల లిస్ట్‌పై ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి.
దీనికి సంబంధించిన ఫైల్ అంతా తన దగ్గర ఉందని, మీకు తోచినంత మొత్తాన్ని పంపిస్తే, ఆ ఫైల్ మీకు కొరియర్ ద్వారా పంపిస్తానని కృష్ణ ఆ మెయిల్‌లో పేర్కొన్నాడు. ఆ అక్కౌంట్ నెంబర్‌ను కూడా మెయిల్‌లో పొందుపరిచాడు. ఒక్క రోజులో సమాధానం చెప్పకపోతే, ఆ తరువాత జరిగే పరిణామాలకు తానేమీ చేయలేనంటూ కృష్ణ ఆ మెయిల్‌లో పేర్కొన్నాడు. బుధవారం తిరుపతి నుంచి ఢిల్లీ వెళుతున్న ఎంపీ గీత, మార్గ మధ్యంలో ఈ మెయిల్ చూశారు. వెనువెంటనే తన వ్యక్తిగత కార్యదర్శికి ఫోన్ చేసి, పోలీసులకు ఫిర్యాదు ఇమ్మనమని ఆదేశించారు. స్థానిక ద్వారకా పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఎంపీ ఆస్తులపై దాడి చేయడానికి ఏసీబీకి అధికారం లేదన్న విషయాన్ని కూడా బ్లాక్‌మెయిలర్ తెలుకోలేదని, అదీకాక ఒక ఎంపీని ఈ విధంగా బెదిరించడం ఎంతవరకూ సమంజసమని గీత ప్రశ్నించారు.