ఆంధ్రప్రదేశ్‌

సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 22: నేటితరం విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాలని లండన్‌కు చెందిన షెఫెల్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆంటోని ఆర్‌వెస్ట్ పేర్కొన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 36వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆంటోని ఆర్‌వెస్ట్ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యావిధానాన్ని ప్రపంచానికి అందించిన సత్యసాయి బాబా ఆదర్శప్రాయుడన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందజేయడం గొప్ప విశేషమన్నారు. ఇటువంటి విద్యావిధానాన్ని సత్యసాయి ప్రసాదించడం విద్యార్థులకు వరమన్నారు. విద్యార్థులు తమపై తమకు నమ్మకాన్ని పెంచుకోవాలని, ఏదైనా సాధించగలమన్న పట్టుదలతో ముందుకెళ్ళాలన్నారు. అటువంటి తరుణంలో అవకాశాలు వారివద్దకే చేరుతాయన్నారు. విద్యార్థులు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలన్నారు. తోటివారికి సాయమందించే సద్గుణాన్ని అలవరుచుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్, రవాణా, ఆరోగ్యం తదితర అంశాలలో విద్యార్థులు అభివృద్ధి చెందాలన్నారు. ఇక్కడ తనకు దివ్యమైన అనుభూతి కల్గిందని, ఈ అవకాశం దక్కడం ఎంతో ఆనందదాయకమన్నారు. వైస్‌ఛాన్సలర్ కేబీఆర్ వర్మ మాట్లాడుతూ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా విద్యలో విలువలకు పెద్దపీట వేయడం సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ సొంతమన్నారు. ఛాన్స్‌లర్ జస్టిస్ ఎన్.వెంకటాచలయ్య 457 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు.