ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక ఇబ్బందులున్నా రెండంకెల వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, (పటమట) నవంబర్ 22: రాష్ట్ర విభజన జరిగి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రెండంకెల వృద్ధి రేటు సాధించగలగామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం ఉదయం శాసనసభలో 344 నిబంధన క్రింద ఎపీలో ‘రెండంకెల వృద్ధి రేటు’పై ప్రత్యేక చర్చ జరిగిన అనంతరం యనమల మాట్లాడుతూ భారతదేశ వృద్ధి రేటు కంటే ఏపీలో వృద్ధిరేటు ఎక్కువగా వుందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచార రీతులతో ఏపీలో రెండంకెల వృద్ధి రేటు సాధించగలిగామని చెప్పారు. రెండంకెల వృద్ధిరేటుపై ప్రతిపక్షాలు కావాలని పసలేని వాదనలు చేస్తున్నాయని కొట్టిపారేశారు. రాబోయే కాలంలో కూడా ఏపీలో రెండంకెల వృద్ధిరేటు ఇదే విధంగా కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదాయం పెరగటం వలన ప్రజలకు పొదుపు చేసే అవకాశం వస్తొందని, దీంతో మరింత అభివృద్ధి జరుగుతోందన్నారు. వ్యవ్యసాయ రంగం అభివృద్ధి చెందటం వల్ల రాష్ట్భ్రావృద్ధికి తొడ్పడుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేయటం వలన వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా అధికంగా వున్నప్పటికీ, అర్బన్ ప్రాంతంలో 29 శాతం జనాభా వుందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేస్తే అదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గత మూడు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం స్థిరంగా పెరుగుతోందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే ఏపీ తలసరి ఆదాయం అధికంగా వుందని పేర్కొన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణాలో అర్బన్ ప్రాంతాల వృద్ధిరేటు అధికంగా వుందన్నారు. తెలంగాణాలో జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువగా వుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుదూర సముద్రతీరం వుందని, దీంతో సముద్రప్రాంత వనరులు, మినరల్స్ ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రస్ధానంలో నిలబెట్టవచ్చన్నారు. అంతకుముందు రెండంకెల వృద్ధిరేటుపై మాజీ మంత్రి కె.మృణాళిని మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదే అన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం, మత్స్య రంగంలో 30 శాతం, హర్టీకల్చర్‌లో 16శాతం వృద్ధిరేటు సాధించగలిగామని చెప్పారు.