ఆంధ్రప్రదేశ్‌

వంశీ రాజీనామా కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 22: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుగుతున్నాయిని అధికార పక్షం భావిస్తున్న తరుణంలో సొంత పార్టీ శాసన సభ్యుడు రాజీనామాకు సిద్ధపడటం బుధవారం అసెంబ్లీ లాబీల్లో తీవ్ర కలకలం రేపింది. శాసన సభ్యుడినైన తన విజ్ఞప్తిని అధికారులు ఖాతరు చేయడం లేదంటూ కన్నీటి పర్యంతమైన కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. అక్కడే ఉన్న తోటి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రాజీనామా పత్రాన్ని చించి వేసి వారించే ప్రయత్నం చేశారు. సమాచారం మంత్రి లోకేష్ వద్దకు వెళ్లడంతో వెంటనే మంత్రి కళా వెంకట్రావును వంశీ వద్దకు పంపించి సర్ది చెప్పించారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని డెల్టా షుగర్స్ విషయంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూంటే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) లోని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మనస్తాపం చెంది తోటి శాసన సభ్యుల వద్ద ఎమ్మెల్యే వంశీమోహన్ కన్నీటి పర్యంతమైయ్యారు. తాను రైతులకు న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో శాసన సభ్యత్వనికి రాజీనామా చేస్తున్నానంటూ, రాజీనామా పత్రాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ వారించే ప్రయత్నం చేసి రాజీనామా పత్రాన్ని చించి వేశారు. హనుమాన్ జంక్షన్‌లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు సంవత్సరాలుగా మూతపడటంతో పాటు దీన్ని తణుకులోని ఆంధ్రా షుగర్స్‌కు అప్పగించాలనే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని, తరలిస్తే రైతులు ఎంతో నష్టపోతారని గతంలో చెరకు రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి వంశీ వినతిపత్రం కూడా ఇచ్చారు. తాజాగా ఈ రోజు కూడా ఈ విషయంపై చర్చించేందుకు రైతులతో కలసి సీఎం కార్యాలయానికి మరో సారి వెళ్లారు. అయితే ఈసందర్భంలో తనపై అధికారులు దురుసుగా ప్రవర్తించారని, ముఖ్యంగా సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్ ఆయనతో సరైన రీతిలో వ్యవహరించలేదనే మనస్తాపంతో అసెంబ్లీ ప్రాంగణంలోనికి వచ్చి రాజీనామాకు సిద్ధపడ్డారు. విషయం మంత్రి లోకేష్ వద్దకు చేరడంతో సర్ది చెప్పించేందుకు మంత్రి కళా వెంకట్రావును వంశీ వద్దకు పంపించారు. వంళీతో ప్రత్యేకంగా మాట్లాడిన కళా రాజీనామాపై వెనక్కి తగ్గేలా వారించారు. ఇదే సమయంలో అసెంబ్లీ లాబీల్లో వంశీ రాజీనామా అన్నింటా చర్చనీయామంశమైయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇదే విషయంపై లాబ్లీలో చర్చించుకోవడం కనిపించింది.