ఆంధ్రప్రదేశ్‌

లాభసాటి సాగే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: వ్యవసాయ రంగంలో అత్యుత్తమ విధానాలకు, ఆవిష్కరణలకు రైస్ కాన్‌క్లేవ్ వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. విజయవాడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న ఇండియా రైస్ కాన్‌క్లేవ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో విత్తనాలు, విద్యుత్, పురుగు మందులు, ఎరువుల పంపిణీలో వ్యవసాయదారులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తొలినాళ్లలోనే అధిగమించిందన్నారు. చైనా, అమెరికా, మరికొన్ని దేశాల స్ఫూర్తిగా వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలకు ఆలంబనగా నిలవాలన్నారు. బయోమెట్రిక్ విధానంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ నిరంతరం సరఫరా చేస్తున్నామని, వ్యవసాయంలో సాంకేతికతను ప్రవేశపెట్టామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వేగంగా జరుపుతున్న రాష్ట్రం మనదేనన్నారు. సేద్యపురంగంలో మిషన్ లెర్నింగ్, జియో ట్యాంగింగ్, సెన్సర్లు, డ్రోన్లు, బయోమెట్రిక్, ఫిజో మీటర్లు, రెయిన్ గన్స్, సెల్‌ఫోన్లు వంటి ఐవోటీ పరికరాలను, ఆధునిక యంత్రపరికరాలను మూడేళ్లక్రితమే ప్రవేశ పెట్టి ఫలితాలు సాధించామని అన్నారు.
వ్యవసాయంతో పాటు ఉద్యానం, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక ఎక్స్‌టెన్షన్ అధికారిని నియమించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఏపీలో ప్రతి మంగళ, బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర , జిల్లా, మండల, గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించి రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. సేద్యపు రంగంలో వినూత్న విధానాలు, ఆలోచనలు షేర్ చేసుకునేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎకరానికి సగటున 5 వేల కిలోలు, గరిష్ఠంగా 9,200 కిలోల చొప్పున దిగుబడి వస్తోందని తెలిపారు. మరింత దిగుబడులు సాధించడం, అదే సమయంలో సాగుబడి వ్యయాన్ని తగ్గించి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆక్వా కల్చర్‌లో 40 శాతం వృద్ధి సాధించి దేశంలోనే ఈ రంగంలో అగ్రగణ్యంగా ఉన్నామని తెలిపారు. ఎక్కడ ఏ లోపం ఉన్నా డ్రోన్ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే సరికొత్త విధానాన్ని రానున్న రబీ సీజన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు