ఆంధ్రప్రదేశ్‌

ఏసీబీకి చిక్కిన సీటీఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, నవంబర్ 22: కడపలోని వాణిజ్య పన్నులశాఖలో సీటీఓగా పనిచేస్తున్న టి.రమేష్‌కుమార్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ట్రాన్స్‌ఫోర్ట్ యజమాని నుంచి బుధవారం రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్‌కుమార్‌రెడ్డి కడప నగరంలోని వాణిజ్య పన్నులశాఖలో సీటీఓగా పనిచేస్తున్నారు. మాసాపేటకు చెందిన శ్రీసాయిరామ్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ బాబూరావుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వేబిల్లుల విషయం పట్టుకోకుండా, దాడులు చేయకుండా ఉండాలంటే రూ.70వేలు లంచం ఇవ్వాలని సీటీఓ రమేష్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో బాబూరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం బాబూరావు రూ.70 వేలు తీసుకువెళ్లి సీటీఓ రమేష్‌కుమార్‌రెడ్డికి ఇవ్వబోగా పక్కనే ఉన్న సునీల్‌కు ఇవ్వమని సూచించాడు. సునీల్ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ నాగరాజు సిబ్బందితో దాడులు జరిపి రమేష్‌కుమార్‌రెడ్డి, సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.