ఆంధ్రప్రదేశ్‌

200 కి.మీ మైలురాయి దాటిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, నవంబర్ 22: వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారం 200 కిలోమీటర్లు దాటింది. ఈనెల 6వ తేదీ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడే వంద మైలురాయి దాటారు. బుధవారం 15వ రోజు బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలోకి ప్రవేశించగానే పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించిన జగన్ అక్కడే ఓ మొక్క నాటారు. మంగళవారం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన జగన్ ముద్దవరం, వెంకటగిరి, పెండేకల్ గ్రామాలమీదుగా నడక సాగించారు.
దారిపొడవునా జనం యువనేతకు నీరాజనం పలుకుతూ తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ఏడాది ఆగితే మన ప్రభుత్వం వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అంటూ అందరినీ పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ముద్దవరం గ్రామంలో గొర్రెలకాపర్లు జగన్‌కు గొర్రెపిల్లను అందజేశారు. గ్రామంలో దివ్యాంగురాలైన ఓ బాలికను పరామర్శించిన జగన్ ఆమెను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. పాదయాత్రలో జానపద గాయకురాలు ఉష పాటలు నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఉషారెత్తించాయి. వెంకటగిరి వద్ద మహిళలు జగన్‌మోహన్‌రెడ్డికి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. మర్రికుంట వద్ద విద్యార్థులు జగన్‌కు స్వాగతం పలికారు. బాలాపురం, పెండేకల్ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెల్దుర్తి మండలంలోకి ప్రవేశించింది.