ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక శాఖ వద్ద మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల జీతాల ఫైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: ఆగస్టు నెల నుండి పెండింగ్‌లో ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాల ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉందని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ మురళీమోహన్, ఎన్ బోసుబాబులు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రధాన కార్యదర్శులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులరెడ్డి, బొడ్డు నాగేశ్వరరావులతో కలిసి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్రతో చర్చించారు. జీతాల ఫైలు త్వరగా క్లియర్ చేయాలని, అదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మోడల్ స్కూల్స్ సిబ్బందికి జీతాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆర్థిక శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించి త్వరగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.