ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: రాష్ట్రంలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి సమస్య ఉన్నదనే విషయం ఇంతవరకు ప్రభుత్వ దృష్టికి రాలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన సమాధానం పట్ల అధికార పక్షానికి చెందిన సభ్యులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్న గ్రామాలనేకం ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేయడం బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలలో ఒకింత కలకలం సృష్టించింది. అయితే సభ్యులు తర్వాత కొంత తేరుకుని లోకేష్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మంచినీటి సరఫరా కొంత మెరుగుపడినప్పటికీ, సమస్య అయితే ఇప్పటికీ ఉందన్నారు. రేపల్లె సభ్యుడు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఉప్పునీటి సమస్యతో ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో మంచినీరు తెప్పించుకోవాల్సి వస్తున్నదన్నారు. వేసవి లోపు మంచినీటి సరఫరాకు చర్య లు చేపట్టాలని కోరారు. కదిరి సభ్యుడు చాంద్ బాషా మాట్లాడుతూ రక్షిత మంచినీరు అందుబాటులో లేక, అత్యధిక గ్రామాలు ఫ్లోరైడ్ నీటితో తల్లడిల్లిపోతున్నాయన్నారు. జనం వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కోస్తా గ్రామాల్లో పైప్‌లైన్లు శిథిలావస్థకు చేరగా మరికొన్ని గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు పైప్‌లైన్ల విస్తరణ లేదన్నారు. పైప్‌లైన్లు ఉంటే రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం. సమర్థత లేని కాంట్రాక్టర్ల వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని, నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులను ఇవ్వొద్దని చెప్పారు. సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఎంతమంచిది అయినా నిర్వహణ ఖర్చులు భరించలేని స్థితిలో ఆ ప్లాంట్లు మూతబడుతున్నాయని అన్నా రు. లీటర్ మినరల్ వాటర్ రూ.20లు అయితే 20 లీటర్లను రూ.2లకు ఇస్తు న్నాం.. నెలకు ఓ వ్యక్తికి కనీసం రెండు వేలు జీతం, విద్యుత్ చార్జీ మరో రెండు వేలు, ఫిల్టర్లు మార్పిడికి నెలకు రెండు వేలు పైగా ఖర్చువుతున్నదన్నారు. దాత లు గదికట్టి, మిషనరీ సమకూర్చినప్పటికీ నెలకు వ్యయం 12 వేలు దాటుతోందని, రాబడి ఆరు వేలు దాటకపోవటం వల్ల క్రమేణా మూతబడుతున్నాయని అన్నా రు. విద్యుత్ చార్జీలు భరించే స్థితిలో పం చాయతీలు లేనందున ఉచిత విద్యు త్ సౌకర్యంతో పాటు ప్రతి నెల కొంత సబ్సి డీ ఇవ్వాలని కోరారు. రామారావు, త్రిమూర్తులు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడి గురించి ప్రస్తావించారు. సభ్యుల ప్రశ్నలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందిస్తూ పంచాయతీల వద్ద బాగానే డబ్బు ఉందంటూ ప్రతి ప్లాంట్ లో రోజూ కనీసం వెయ్యి లీటర్ల పైనే వాడకం జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని, అప్పుడే ఆ ప్లాంట్లు మనుగడ సాగించగలవన్నారు.