ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ ముట్డడికి ఎమ్మార్పీఎస్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 22: అసెంబ్లీ ముట్డడికి ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం కొంతసేపు హల్‌చల్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు అన్యాయం చేస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆరోపిస్తోంది. వెంటనే బిల్లు పెట్టాలని డిమాండు చేస్తూ గత కొద్దిరోజులుగా ఏపిలో జిల్లాల వారీగా ఆందోళన కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించేందుకు చేసిన వ్యూహరచనలో భాగంగా బుధవారం కార్యకర్తలు హల్‌చల్ చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి ముందుగానే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అసెంబ్లీ పరిసరాల్లో, మార్గాల్లో గట్టి భద్రతా, బందోబస్తు ఏర్పాటు చేసిం ది. అయినా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ముట్టడికి తరలిరావటంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మల్కాపురం గ్రామం నుంచి వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలంతా అసెంబ్లీలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా పెట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో 30మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్టేషన్‌కు తరలించారు. మల్కాపురం గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం నుంచి సుమారు 30మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రహస్యంగా మకాం వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.