ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అదనపు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ లిమిటెడ్‌కు మరిన్ని అదనపు నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కోన రఘుపతి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులు ఇచ్చారు. 2014-15 సంవత్సరానికి రూ. 25 కోట్లు, 2015-16 సంవత్సరానికి రూ. 35 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా విద్య, పోటీ పరీక్షలకు కోచింగ్, నైపుణ్య అభివృద్ధి మొదలైన రంగాల్లో పరిపాలన ఖర్చులు, స్థిరాస్తులపై ఇంత వరకూ 16.85 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సహకార పరపతి సంఘానికి గ్రాంటుగా 20 కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక సంవత్సరం చివరికి 60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాల వారీ లబ్దిదారుల డాటాను అసెంబ్లీ ముందుంచారు. అనంతపురం జిల్లాకు 100.15 లక్షలు, చిత్తూరు జిల్లాకుస 57.50 లక్షలు, తూర్పుగోదావరికి 247.61 లక్షలు, గుంటూరు జిల్లాకు 188.39 లక్షలు, కృష్ణా జిల్లాకు 238.334 లక్షలు, కర్నూలు జిల్లాకు 79.71 లక్షలు, ప్రకాశం జిల్లాకు 78.94 లక్షలు, నెల్లూరుకు 81.37 లక్షలు, శ్రీకాకుళం జిల్లాకు 70.02 లక్షలు, విశాఖ జిల్లాకు 125.11 లక్షలు, విజయనగరం జిల్లాకు 64.02 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాకు 143.76 లక్షలు, కడప జిల్లాకు 38.56 లక్షలు కేటాయించామని అన్నారు. విద్య కోసం భారతి పథకం అమలుకు 14.81 కోట్లు, పోటీపరీక్షల కోచింగ్ కోసం వశిష్ట పథకం అమలుకు 22.79 లక్షలు, నైపుణ్యం పెంపుదల కోసం ద్రోణాచార్య పథకం అమలుకు 9.58 లక్షలు వెచ్చిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ధూపదీపనైవేద్యాలకు రాష్ట్రప్రభుత్వం నిధులు పెంచిందని ఒక్కో దేవాలయానికి గతంలో రూ. 2500 ఉండగా, ఇపుడు రూ. 5వేలు ఇస్తున్నామని మంత్రి సభకు వివరించారు. అలాగే ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌లను చెల్లించడం జరుగుతోందని తెలిపారు.