ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర సహాయంపై ప్రజల్లో ప్రచారం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకంటే అధికంగా నిధులు మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం అందిస్తున్న సహాయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, హైవేలు, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, మెగాప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్ భగత్‌తో కలసి రవిశంకర్‌ప్రసాద్ ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,60,819 కోట్లు కేటాయించామన్నారు. ఎయిమ్స్, ట్రిపుల్ ఐటి, ఐఐటి, పెట్రో యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకానున్నాయన్నారు. 10 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు మంజూరుచేస్తోందని, రాష్ట్రంలో ఇప్పటికే ఐదు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ క్లస్టర్లు మంజూరుకాగా మరో క్లస్టర్‌ను తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
టెక్నాలజీ సహాయంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. దేశ జనాభా 125 కోట్లు ఉండగా 102 కోట్ల సెల్‌ఫోన్లు దేశంలో వినియోగంలో ఉన్నాయన్నారు. గత సంవత్సరం మేకిన్ ఇండియా నినాదంతో దేశంలోనే 11 కోట్ల మొబైల్ ఫోన్లు తయారు చేశామన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో రానున్న 3 సంవత్సరాల్లో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కారణంగా పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. జన్-్ధన్ కార్యక్రమాన్ని దేశంలో ఒక యజ్ఞంలా నిర్వహించి, కేవలం ఎనిమిది నెలల్లో 22 కోట్ల మంది పేదలకు బ్యాంకు అకౌంట్లు కల్పించామన్నారు.గత 18 నెలల కాలంలో 3 కోట్ల మంది లబ్ధిదారులు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు పొందగా ఇందులో 70 శాతం మహిళలే ఉండటం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు గతంలో ఎన్నడూ లేని రీతిలో దేశమంతటా సీనియర్ మంత్రులు పర్యటించి 200 పట్టణాల్లో వికాస్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని రవిశంకర్‌ప్రసాద్ వివరించారు. సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్