రాష్ట్రీయం

షార్‌కు చేరిన కార్డోశాట్-2సి ఉపగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. అగ్రరాజ్యాలకు దీటుగా ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు శ్రీకారం చుట్టింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపే మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్డోశాట్-2సి ఆదివారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి రోడ్డుమార్గాన భారీ భద్రత నడుమ షార్ చేరింది. దీంతో విదేశాలకు చెందిన మరో 19 ఉపగ్రహాలు, చెన్నై సత్యభామ యూనివర్శిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన మరో రెండు చిన్న నానో ఉపగ్రహాలతో కలిపి మొత్తం 22 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. విదేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలు ఇప్పటికే షార్ చేరాయి. శాస్తవ్రేత్తలు ఈ ఉపగ్రహాలను క్లీన్‌రూమ్‌లో పెట్టి తుది పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదికలో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. సోమవారం నుండి నాలుగో దశ అనుసంధాన పనులతో పాటు రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చే ప్రక్రియను చేయనున్నారు. ఒకేసారి 22 ఉపగ్రహహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శ్రీకారం చుట్టడంతో ప్రపంచ దేశాలు చూపు షార్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా 29 ఉపగ్రహాలను ప్రయోగించి విజయం సాధించింది. మళ్లీ దాని తరువాత మన శాస్తవ్రేత్తలు ఇలాంటి భారీ ప్రయోగం చేసేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇది విజయవంతమైతే అమెరికా తరువాత మన దేశం అధిక ఉపగ్రహాలు ప్రయోగించిన దేశంలో రెండో స్థానంలో నిలవనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఎంఆర్‌ఆర్ సమావేశం ఈనెల 8న డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్‌లో జరగనుంది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగ తేదీతో పాటు సమయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించనుంది. ఇటు మన శాస్తవ్రేత్తలతో పాటు విదేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు షార్‌కు చేరుకోవడంతో శ్రీహరికోటలో సందడి వాతావరణం నెలకొంది. అన్నీ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈనెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది.