ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ నగరాలకు ‘మాస్టర్ ప్లాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 6: రాష్ట్రంలో స్మార్ట్ నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోంది. రెండు దశల్లో 9 నగరాలకు రెండు దశల్లో కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ని సిద్ధంచేసే బాధ్యతను గుర్‌గావ్‌కు చెందిన మెస్సర్స్ యూఎంటీసీ సంస్థకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, పురపాలకశాఖలతో సంస్థ ఒప్పందం కుదుర్చుకో నుంది. తొలిదశలో ఐదు నగరాలు ఏలూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి రెండవ దశలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు నగరాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 14 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విజయనగరం, శ్రీకాకుళం, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి పట్టణాలు కూడా ఉన్నాయి. వీటిలో గుంటూరు, తెనాలి సీఆర్డీఏ పరిధిలో ఉన్నందున మాస్టర్‌ప్లాన్ ఇప్పటికే సిద్ధమైంది. కాగా విజయనగరం, శ్రీకాకుళం, మచిలీపట్నం పట్టణాల అభివృద్ధికి వెసులుబాటు కల్పించాల్సిందిగా ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన చేయనుంది. కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)కి మొత్తం నాలుగు సంస్థలు ఫైనాన్స్, టెక్నికల్ బిడ్‌లలో పోటీపడ్డాయి. ఢిల్లీకి చెందిన డిమిట్స్, చెన్నైకు చెందిన మెసర్స్ ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్, గుర్‌గావ్‌లోని ఐసీఆర్‌ఏ, యూఎంటీసీ సంస్థల దరఖాస్తులు పరిశీలించిన అనంతరం యూఎంటీసీ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ నగరాల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొదటి రెండు దశల్లో 9 పట్టణాలకు సంబంధించి 20 ఏళ్ల కాల వ్యవధిలో పెరుగుతున్న జనాభా, వౌలిక వసతుల కల్పన, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, భౌగోళిక స్థితిగతులపై సంస్థ ఆధ్యయనం చేసి ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రస్తుతం నగరాలు, పట్టణాల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో స్మార్ట్ నగరాలకు అంకురార్పణ జరుగుతోంది. మాస్టర్‌ప్లాన్ పర్యవేక్షణ బాధ్యతలను అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.