విశాఖపట్నం

రెండు రోజులు.. ఇరవై గంటలు * రాష్టప్రతి పర్యటన సాగిదిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ నగరంలో రెండు రోజుల పర్యటన వివరాలను యంత్రాంగం వెల్లడించింది. రెండు రోజుల పర్యటనలో రాష్టప్రతి కోవింద్ విశాఖలో 20 గంటలు గడుపుతారు. తొలి రోజు పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.40 గంటల నుంచి 3.40 గంటల వరకూ ఐఎన్‌ఎస్ డేగాలో విశ్రాంతి తీసుకుంటారు. నాలుగు గంటలకు ఆర్కే బీచ్‌లోని టీయూ-142 విమాన ప్రదర్శనశాలను ప్రారంభిస్తారు. ఫోటో సెషన్, సత్కారం అనంతరం 4.15 గంటలకు బయలుదేరి పార్క్ హోటల్ జంక్షన్‌కు చేరుకుని స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి 4.30 గంటలకు ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుంటారు. ఏయూలో ఈ-క్లాస్‌రూం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.15 గంటలకు బుల్లయ్య కళాశాల సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ స్కూల్‌కు చేరుకుని సందర్శిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 5.55 గంటలకు ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్ ప్రెసిడెన్షియల్ సూట్‌లో బసచేస్తారు. రాత్రి 7.58 గంటలకు ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్ లాన్‌కు చేరుకుని ఐఎన్‌ఎస్ కల్వరి తపాలాబిళ్లను ఆవిష్కరిస్తారు. రాత్రి 8.10 నిముషాలకు నౌకాదళం ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా అతిధిగృహానికి చేరుకుంటారు. శుక్రవారం (మిగతా 7వ పేజీలో)
ఉదయం 8 గంటల నుంచి 8.40 గంటల వరకూ నౌకాదళం జలాంతర్గాములకు కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 8.40 గంటలకు బయలుదేరి ఐఎన్‌ఎస్ డేగా అతిధిగృహానికి చేరుకుంటారు. తిరిగి ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

ప్రశ్నిస్తా...నిలదీస్తా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 6: బీజేపీ, టీడీపీలకు ఓట్లు వేయాలని ఆనాడు అడిగాను. ప్రజా సమస్యలు పట్టించుకోపోతే, ఈ రెండు పార్టీల నాయకులను నిలదీస్తానని ఆనాడే చెప్పానని, అందుకే ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని జన సేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. డీసీఐ ఉద్యోగులకు ఎవరు అండగా ఉన్నా, లేకపోయినా, జనసేన పార్టీ వెన్ను దన్నుగా నిలుస్తుందని పవన్ భరోసా ఇచ్చారు. విశాఖ, అనకాపల్లి ఎంపీలు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకు తిరుగుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ప్రైవేటీకరణపై ఆందోళన చెంది ఆ సంస్థలో పనిచేస్తున్న వెంకటేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సీహార్స్ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ బాధిక కుటుంబాలకు నైతిక మద్దతు ఇవ్వడానికి వచ్చానని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలను స్థాపించారని, అది ప్రభుత్వం సామాజిక బాధ్యతగా భావించిందని అన్నారు. ఇందులో భాగంగానే డీసీఐని నెలకొల్పిందని అన్నారు. 10 రూపాయలు ఉన్న డీసీఐ షేర్ ధర ఇప్పుడు 700 రూపాయలకు చేరుకుందని అన్నారు. ఈ సంస్థ లాభాల్లో లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినా, తప్పుకాదని, లాభాల్లో ఉన్న దీన్ని ఎందుకు విక్రయించాల్సి వస్తోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ ప్రశ్నించారు. ఈ సంస్థ ఉద్యోగులు తమ గోడు వెళ్లబుచ్చుకోడానికి ఎంపీ హరిబాబు వద్దకు వెళితే, చులకనగా మాట్లాడారని, ఆయన ఈ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని పవన్ అన్నారు. అలాగే అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావుకు కూడా ఈ సంస్థను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని, డీసీఐ ప్రైవేటుపరం కాకుండా కేంద్రంపై వత్తిడి తేవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. డీసీఐని ప్రైవేటీకరించవద్దని కోరుతూ ప్రధానికి లేఖ పంపినట్టు పవన్ చెప్పారు. అంతకు ముందు డీసీఐ అధికారులు తమ సంస్థకు జరుగుతున్న అన్యాయాన్ని పవన్‌కు వివరించారు.

ఇవేమి సమావేశాలు!

విశాఖపట్నం (జగదాంబ), డిసెంబర్ 6: జెడ్పీ సమావేశానికి మంత్రులు హాజరుకారు... కలెక్టర్ అందుబాటులో ఉండరు... గత సర్వసభ్య సమావేశంలో సభ్యులు, ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. అలాంటిప్పుడు ఏందుకీ ఈ సమావేశాలు అంటూ పలువురు ఎమ్మెల్మేలు, సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను నిలదీశారు. జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగానే జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఎన్‌టి ఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా సభలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం సర్వసభ్య సమావేశం ప్రారంభించారు. ఈ సమయంలో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ గత సర్వసభ్య సమావేశంలో సభ్యులు, ఎమ్మెల్యేలు పలు సమస్యలపై అడిగిన వాటికి సమాధానం తెలపాలని, మెక్కుబడిగా సమావేశాలు నిర్వహించుకోవడం ఎందుకు? జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తమ సమస్యలు ఎప్పుడు(మిగతా 7వ పేజీలో)
పరిష్కరించుకుంటారని, వీటికి సమాధానం చెప్పిన తరువాతనే చర్చ కొనసాగించాలని కోరారు. చర్చలో ముందుగా వ్యవసాయ శాఖ కాగా, దీనికి సంబంధించిన ప్రగతి నివేదికను వ్యవసాయ శాఖ జేడీ శివప్రసాద్ చదువుతుండగా ఎమ్మెల్సీ మూర్తి కలుగజేసుకోని మీరు ఇక్కడకు నివేదికలను చదవడానికి రాలేదు.. గతంలో నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి అని నిలదీశారు. అంతా నత్తనడకనే సాగుతోంది. జిల్లాలో క్వాలీటి విత్తనాలు ఇస్తున్నారా? సీజనల్ వారీగా వాటి వివరాలువ్వండి..? రైతులకు ఎంత ఆదాయం పెరిగింది? ఎంత మంది రైతులకు పంటల బీమా చేయించారు? వాటి వివరాలు తెలపాలంటూ సంబంధింత అధికారిని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన లెక్కలన్ని తప్పులుగానే వున్నాయింటూ మండిపడ్డారు.
* మీరు చెప్పింది వినడానికి మేము రాలేదు: ఎమ్మెల్యే పంచకర్ల
జెడ్పీ సమావేశంలో ఏదో లెక్కలు తీసుకువచ్చి చెప్పితే వాటిని వినడానికి మేము రాలేదని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. గతంలో సభ్యులు అడిగిన సమస్యలను ఎన్నింటిని పరిష్కరించారు? ఇంకా ఎన్ని పరిష్కరించాలి? అవి చెప్పండి.. ఎప్పుడూ ఇలా చెప్పుకునేటప్పుడుకే సమయం సరిపోతుంది.
* కోతులు బెడద నుంచి రక్షించండి: ఎమ్మెల్మే కెఎస్‌ఎన్ రాజు
జిల్లాలో చాలా మండలాల్లో కోతుల బెడద ఉంది. వీటి కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. వీటి నివారించడానికి సంబంధింత శాఖలైన ఫారెస్టు, వ్యవసాయ శాఖ తదితరల శాఖలు స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని చోడవరం ఎమెల్యే కెఎస్‌ఎన్‌ఎన్ రాజు కోరారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్య ఫారెస్టు శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా డ్వామా పధకానికి సంబంధించిన విషయంపై చర్చ జరుగుతుండగా పలువురు సభ్యులు, ఎమ్మెల్యేలు తమ సమస్యలను తెలియజేసి తక్షణమే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై డ్వామా పీడీ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామి ఫధకంలో బకాయిలు వున్న మాటా వాస్తవమేనని ఇటీవలే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వారం రోజుల్లోగా రూ. 56 కోట్ల వేతనాలు చెల్లిస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సృజన, జెడ్పీ సీఈఓ జయప్రకాష్‌నారయణ, ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరీ, పీలా గోవింద సత్యనారయణ, బండారు సత్యనారయణ మార్తి, ఎంపీ అవంతి శ్రీనివాస్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
* ఇకపై మంత్రులతోనే జెడ్పీ సమావేశం : చైర్‌పర్స్‌న్ లాలంభవానీ
జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, సభ్యులు మంత్రులు, కలెక్టర్ లేకుండా సభ జరగడంపై నిరసన తెలపడంతో స్పందించిన జెడ్పీ చైర్‌పర్స్‌న్ లాలం భవానీ వచ్చే సర్వసభ్య సమావేశం జిల్లా మంత్రులు, కలెక్టర్‌తో మాట్లాడి తేది నిర్ణయించిన తరువాతనే సభ్యులకు సమావేశం సమాచారాన్ని అందిస్తామని తెలిపారు.
* అంశాలు ఇరవై... చర్చ జరిగినవి నాలుగు
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పెండింగ్ సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించడానికి 20 శాఖలతో నివేదికలు సిద్దం చేయగా...కేవలం నాలుగు శాఖలతోనే చర్చించి మమ అనిపించారు. అయితే మిగిలిన శాఖల అధికారులు కూడా పూర్తి స్థాయి సమాచారంతో హాజరైనప్పటికీ మంత్రులు, కలెక్టర్‌లు అందుబాటులో లేక పోవడంతో మధ్యాహ్నా భోజన సమయానికే సరిపేట్టేశారు. అంతేకాకుండా అంతంతమాత్రంగా వచ్చిన ఎమ్మెల్యేలంతా సభ మధ్యలోనే వెళ్లిపోవడం మరింత గమనార్హం.

నిధులు ఖర్చు చేయకుంటే
పనులు రద్దు
నర్సపట్నం(టౌన్), డిసెంబర్ 6: నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు తెస్తుంటే పనులు చేపట్టడంలో ఆలసత్వం జరుగుతుందని మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేసారు. పనులు మొదలు కాకుంటే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. బుధవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో హౌసింగ్‌కు 621 ఇళ్ళు మంజూరు కాగా కొత్తగా మరో 271 ఇళ్ళు మంజూరైనట్లు తెలిపారు. అయితే పనులు ప్రారంభంలో మాత్రం చాలా జాప్యం జరుగుతుందని , పనులు చేపట్టని ఇళ్ళను రద్దు చేయాలని అధికారులకు సూచించారు. 2014 తరువాత అనుమతులు లేకుండా చాలా మంది లబ్దిదారులు ఇళ్ళు నిర్మించుకున్నారని, అటువంటి ఇళ్ళకు ప్రభుత్వం 93 వేల చొప్పున నిధులు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే హౌసింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ఇచ్చిన తరువాత నిధులు మంజూరు చేయాలన్నారు. అంగన్‌వాడీల భవనాల నిర్మాణంలో నర్సీపట్నం మండలం వేములపూడి , మెట్టపాలెంలో సకాలంలో పనులు చేపట్టకపోవడం వలన జిల్లా కలెక్టర్ అనుమతులు రద్దు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఎంపీపీ రమణమ్మతో నిధులు తీసుకువచ్చినప్పుడు పనులు చేపట్టకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. అనంతరం ఆర్. అంబ్.బి. అధికారులు పనులపై సమీక్షించారు. ఆర్.డి. ఎఫ్. నిధులతో చేపట్టే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చెయ్యవద్దని, ఈనిధులు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారన్నారు. పెదబొడ్డేపల్లి చెరువుపై వాకింగ్ ట్రాక్, చెరువు పొర్లు పనులకు 60 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేసినా, పనులు ప్రారంభం కాలేదన్నారు. రావణాపల్లి రిజర్వాయర్ వాకింగ్ ట్రాక్ కోసం 13 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్తగా 11.50 కోట్ల రూపాయలతో కాలువ లైనింగ్ పనులకు నిధులు మంజూరయ్యాయని త్వరితగతిన పనులు చేపట్టాలన్నారు. గత ఏడాది నిర్మించాల్సిన చెక్‌డ్యామ్ పనులను నెలాఖరులోగా ప్రారంభించకుంటే రద్దు చేయాలని అధికారులకు సూచించారు.

రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడులు
* 375 టన్నుల చౌకబియ్యం సీజ్
చోడవరం, డిసెంబర్ 6: మండలంలోని ముద్దుర్తి జంక్షన్ వద్ద గల రైస్‌మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం మండలంలోని వాసవి స్టీమ్ అండ్ ఫ్లోర్ మిల్లుపై విజిలెన్స్ ఎస్పి బి. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 375 టన్నుల చౌక బియ్యాన్ని సీజ్ చేసారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రైస్‌మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యం నిల్వలు, వాటికి సంబంధించిన రికార్డులు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసవీ స్టీమ్ అండ్ ఫ్లోర్‌మిల్లు యజమాని పూసర్ల సందీప్‌ను బియ్యం నిల్వలు ఏ మేరకు ఉన్నది వాటిని ఏ విధంగా ఎక్కడి నుండి సేకరించినది తదితర అంశాలపై ప్రశ్నించారు. సంబంధిత రికార్డులతో బియ్యం నిల్వలను సరిపోల్చారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు, డిఎస్పి పిఎం నాయుడు తదితరులను కలిసిన విలేఖర్లతో వారు మాట్లాడుతూ సుమారు 7.50లక్షల విలువ కలిగిన 375 టన్నుల చౌక బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఈ తనిఖీల్లో వెల్లడైందన్నారు. వీటిని సీజ్ చేసి సంబంధిత సివిల్ సప్లయిస్ అధికారులకు నివేదికలు అందజేస్తామన్నారు. అనంతరం అక్కడకు సమీపంలో ఉన్న శ్రీ సాయిలక్ష్మి రైస్‌మిల్లులో కూడా తనిఖీలు చేసే అవకాశముందని సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు మల్లికార్జునరావు, ఎన్. శ్రీనివాసరావు, డిసిపివో మోహన్, రేవతి, అనకాపల్లి డివిజన్ ఎఎస్‌వో ఆర్. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆరునెలల్లోగా జిరాయితీ భూముల సర్వే
నర్సీపట్నం ఆర్డీవో కె. సూర్యారావు
నక్కపల్లి, డిసెంబర్ 6: నర్సీపట్నం డివిజన్ పరిధిలోని పది మండలాల్లో కూడా ఆరునెలల్లో శతశాతం జిరాయితీ భూములను సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆర్డీవో కోరాడ సూర్యారావు తెలిపారు. ఇక్కడి తహశీల్దార్ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయన రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, పిసిపిఐఆర్ పరిధిలో భూ సేకరణకు సంబంధించి జిరాయితీ భూముల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాల్లో 35వేల 333 ఎకరాల్లో సర్వే పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 68 గ్రామాల్లో 6452సర్వే నెంబర్లలో సర్వేపనులు పూర్తయ్యాయన్నారు. ఇందుకు సంబంధించి 15వేల 272మంది రైతుల నుండి రెవెన్యూ రికార్డుల తప్పు ఒప్పుల సవరణ, 1బి అడంగళ్ తదితర మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు అందాయని, వాటన్నింటిని కంప్యూటరీకరణ చేసి సరిచేయడం జరుగుతుందని ఆర్డీవో సూర్యారావు తెలిపారు. పది మండలాల్లో పది మంది మండల సర్వేయర్ల ఆధ్వర్యంలో 40మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు రికార్డుల స్వచ్చీకరణ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరునెలల్లో సర్వేపనులు పూర్తికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎస్. రాణీ అమ్మాజీ, డిప్యూటీ తహశీల్దార్ వి. శ్రీనివాసరావు, ఆర్‌ఐ 1, 2 బంగార్రాజు, క్రాంతి, మండల సర్వేయర్ శ్రీరామూర్తి సహా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హైవేలో ప్లెట్ లైట్స్ ప్రారంభం
యలమంచిలి, డిసెంబరు 6: జాతీయ రహదారిపై కె. పురుషోత్తపురం వద్ద ములకలాపల్లి మైహోం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ప్లెట్ లైట్స్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ శర్మ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి పూట జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలకు ప్రధానంగా డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం, చీకటి ప్రాంతం కావడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు దారితీస్తున్నందు వల్ల లైటింగ్ అవశ్యకత ఉందన్నారు. దీనికి ములకలాపల్లి మైహోం ఇండస్టీస్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీనియర్ డిజిఎం రమేష్ పండిట్ మాట్లాడుతూ జాతీయ రహదారి పాయకరావుపేట నుండి యలమంచిలి వరకు రాత్రిపూట రోడ్డు ప్రమాదాలను నివారించుటకు నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచన మేరకు రూ.3లక్షల 40వేలు విలువ చేసే ఐదుచోట్ల సోలార్ బ్లింకర్స్, కె. పురుషోత్తపురం వద్ద హైమాస్ట్ పోల్, ప్లెడ్ లైట్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి, యలమంచిలి సిఐ కెకెవి విజయనాధ్, రూరల్ ఎస్‌ఐ డి. రాము, ఎజిఎం ఎల్. శ్రీనివాసరావు, డి. వెంకటరావు, జిఎంఆర్ మేనేజర్ రామేశ్వరరావు, ములకలపల్లి, పురుషోత్తపురం గ్రామపెద్దలు పాల్గొన్నారు. అలాగే రాంబిల్లి మండలం పంచదార్ల వద్ద కూడా హైమాస్ట్ ప్లెడ్ లైట్‌ను డిఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచదార్ల సర్పంచ్ వి. దినిబాబు, ఎస్‌ఐ చక్రధర్‌రావు గ్రామస్తులు పాల్గొన్నారు.

‘కాపులకు గుర్తింపునిచ్చిన ఘనత చంద్రబాబుదే’

అనకాపల్లి, డిసెంబర్ 6: కాపులను బీసిల్లో చేర్చి చరిత్రలో తమ సామాజిక వర్గం హృదయాల్లో చెరగని ముద్రను సిఎం చంద్రబాబు వేసుకున్నారని ఆ సామాజిక వర్గానికి చెందిన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం ముక్తకంఠంతో స్పష్టం చేసారు. స్థానిక సీతారామాలయం నందు బుధవారం జరిగిన పట్టణ తూర్పుకాపుసంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జరిపిన పాదయాత్రలో చంద్రబాబు కాపుల సమస్యలను గ్రహించి తాము అధికారంలోకి వస్తే బీసీల్లో చేరుస్తామని మేనిఫెస్టోలో చేర్చి భరోసా ఇచ్చారన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే బీసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సంబంధిత సామాజిక వర్గానికి రుణాలు మంజూరు చేసారన్నారు. శాసనసభలో శాసనమండలిలో కాపులకు రిజర్వేషన్‌ను కల్పించిన ఘనతను చంద్రబాబునాయుడు దక్కించుకున్నారని కొనియాడారు. సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ తాకాశిబాబు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చిన చంద్రబాబుకు ఎళ్లవేళలా రుణపడి ఉంటామన్నారు. పట్టణ తెలుగుయువత అధ్యక్షులు గొర్లి శేఖర్ మాట్లాడుతూ కాపులకు ఉపకులాలను సైతం బీసీల్లో చేర్చడం అభినందనీయమన్నారు. ఈసమావేశంలో మాజీ కౌన్సిలర్ కుప్పిలి జగన్, వానపల్లి సన్యాశిరావు, వాకాడ కోటి, బొద్దపుప్రసాద్ పాల్గొన్నారు.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!

విశాఖపట్నం (జగదాంబ), డిసెంబర్ 6: వైద్యులు ఉండరు... రోజు డ్యూటీకి రారు... ఏమిని ప్రశ్నిస్తే మరో పిహెచ్‌సికి వెళ్లమంటారు... మూడు నెలలగా వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు..సకాలంలో రోగులకు వైద్యసేవలందక ప్రాణాలు పోతున్నాయి. ఈ సమస్యలను ఎవరూ పరిష్కరిస్తారు? మేము ఎవ్వరిని సంప్రదించాలి...ప్రతీ జెడ్పి సమావేశంలో మా సమస్యలను చెబుతూనే ఉన్నాము. నేటికి పరిష్కారం కావడం లేదుంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిపై ఎమెల్యేలు, జెడ్పీ సభ్యులు మండిపడ్డారు. బుధవారం జిల్లా పరిషిత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ లాలం భవానీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ అచ్చుతాపురం పిహెచ్‌సికి గత మూడు నెలలగా పూర్తి స్థాయి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైద్యులు, ఆసుపత్రికి వౌలిక వసతులు కల్పన విషయంలో సమస్యలు చెబుతున్న ప్రతీ సారీ ఏదో ఒక కుంటి సాకు చెబుతూ కాలం గడుపుతున్నారే తప్ప ఒక్క సమస్య కుడా పరిష్కరం కావడం లేదున్నారు. పాయకరావుపేట నియెజకవర్గంలోని పిహెచ్‌సిలున్ని శిథిలావస్థలో ఉన్నాయని వాటి మరమ్మతులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని కోరారు. ప్రభుత్వానికి శాఖ పరంగా పంపిన లేఖలు మాకు అందజేస్తే వాటిని సంబంధిత మంత్రితో మాట్లాడి మంజురుయ్యేలా చుస్తామన్నారు. నక్కపల్లి పిహెచ్‌సి,సిహెచ్‌సికి తక్షణమే ఆర్థోపెడిక్ డాక్టర్‌ను నియమించాలన్నారు. జిల్లాలో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా ఉందని సమస్యలు పరిష్కారం కాకపోతే ఏలా అని ప్రశ్నించారు. పెందుర్తి ఎమెల్యే బండారు సత్యనారయణమూర్తి మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో డి ఎంహెచ్ ఓ, ఆర్డీ లేరని తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ పెండింగ్ సమస్యలపై పక్షం రోజులలోగా ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ పూనం మాలకోండయ్యతో ఎమ్మెల్యేలంతా పాల్గొనేలా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలో కుర్చోని ఉంటే ఇక్కడి సమస్యలు పరిష్కారం కావని జిల్లాలో సమస్యలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సృజనను ఆదేశించారు. అదే విధంగా అగనంపూడి ఆసుపత్రికి సంబంధించి పెండింగ్ సమస్యలపై కూడా చర్చించాలన్నారు. మునగపాక ఎంపీపీ అడారి మంజు మాట్లాడుతూ మండలంలోని చూచికోండ పిహెచ్‌సిలో వైద్యుడు సమయానికి డ్యూటీకి రాకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, వారం రోజులల్లోగా వైద్యుని మార్చి మరో వైద్యుని నియమించాలని లేకుంటే ఆరోగ్య శాఖ కార్యలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ముంచింగ్‌పుట్ పిహెచ్‌సిలో ఇద్దరు నర్సులు మాత్రమే రోగులకు వైద్య సేవలు చేస్తున్నారని పూర్తి స్థాయి వైద్యుని వేయాలని కోరారు. దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు గాలి వరలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో వ్యాధుల తీవత్ర పెరుగుతుందని ప్రధాన కార్యాలయంలో ఉన్న డెమో విభాగం పనితీరు మెరుగుపర్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల కో- ఆర్డినేటర్ నాయక్, ఎన్‌టి ఆర్ వైద్య సేవ జిల్లా కో- ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 6: ఒక కుటుంబం బాగుపడాలంటే గృహిణి చైతన్యం కావాలి. దేశం బాగుపడాలంటే మొత్తం మహిళా లోకమే చైతన్యం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర రావు అన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మహిళా చైతన్య సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసం పనిచేస్తే అది దేశం కోసం పనిచేస్తున్నట్టేని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ఒక్కసారి మననం చేసుకుంటే మహిళల కోసం కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు గుర్తుకు వస్తాయన్నారు. దేశంలో ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ జన్‌థన్ ఖాతాలను తెరిపించారన్నారు. బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్న మోదీ నిర్ణయాన్ని అప్పట్లో సరిగా అర్ధం చేసుకోలేకపోయారని, ప్రస్తుతం ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారు ఖాతాకు చేరుకుంటున్నాయన్నారు. దీని వల్ల దళారులు చేతి వాటం తగ్గిందన్నారు. ఇక మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి ప్రధాని మోదీ తీసుకున్న మరో నిర్ణయం మరుగుదొడ్ల నిర్మాణమని అన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని మోదీ భావించడం ద్వారా మహిళల ఆత్మగౌరవానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అలాగే ప్రధాని ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటా గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. స్టాండప్ కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుర్ సమ్మిట్ (జీఇఎస్)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంకను ఆహ్వానించడం ద్వారా దేశంలో మహిళలకు ప్రాధాన్యతను ప్రపంచ వ్యాప్తం చేశారన్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకు బీజేపీ మహిళా చైతన్య సదస్సును నిర్వహించిందన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, పార్లమెంట్‌లో బిల్లు వీగిపోతే పదవిని కూడా వదులుకున్నారని గుర్తు చేశారు. అటువంటి మహాత్ముని ఆశయాలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే హరిబాబు మాట్లాడుతూ మహిళా సాధికారితతోనే దేశం పురోభివృద్ధి సాధ్యమని విశ్వసించిన ప్రధాని మోదీ ప్రభుత్వ పరంగా వారికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతి రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాలతీరాణి, బీజేపీ నగర అధ్యక్షుడు ఎం నాగేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు జే పృధ్వీరాజ్, నగర అధ్యక్షురాలు ప్రేమకుమారి, తదితరులు పాల్గొన్నారు.