ఆంధ్రప్రదేశ్‌

శే్వతపత్రం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులపై శే్వతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిన పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు వెనుకంజ వేయటంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరుచేసిన నిధుల పద్దు అడగటంలో కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని, ఆ మేరకు లెక్కలు చూపించి, పారదర్శకంగా ఉంటే తప్పేమిటన్నారు. రాష్ట్రప్రభుత్వం ఈవిషయంలో నీళ్లు నమిలేకొద్ది అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ చివరకు నాలోనూ పలు సందేహాలు వస్తాయన్నారు. నిర్మాణ విషయంలో ఎప్పటికప్పుడు పారదర్శకంగా, జవాబుదారీతనాన్ని నిరూపించుకుంటే ముందుకు వెళ్లవచ్చునన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని గురువారం పవన్‌కళ్యాణ్ సందర్శించారు. ఈసందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఏ ప్రభుత్వానిదో, పార్టీదో కాదని, రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే ప్రాజెక్టు అన్నారు. ప్రాజెక్టుపై తనకు పూర్తి అవగాహన లేదని, అందుకోసమే పర్యటిస్తున్నానని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణ సమయంలోనే సర్ ఆర్థర్ కాటన్‌కు పోలవరం ప్రాజెక్టు ఆలోచన వచ్చిందని, అప్పటినుంచి అది వాయిదా పడుతూనే వచ్చిందన్నారు. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రాజెక్టు పనులను ప్రారంభించారని, జలగం వెంగళరావు హయాంలో కొంతవరకు ముందుకెళ్లినా ఆ తర్వాత మూలనపడిందన్నారు. రూ.125 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పుడు రూ.58 వేల కోట్లకు చేరిపోయిందన్నారు. మరికొంతకాలం జాప్యం జరిగితే రూ.65 వేల కోట్లకు చేరిపోతుందని చెపుతున్నారన్నారు. 2014లో రూ.16 వేల కోట్ల అంచనా ఉండగా అందులో రూ.13వేల కోట్లు ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుగాను, రూ.3000 కోట్లు పునరావాస ఖర్చుగాను అంచనావేశారన్నారు. ఆ తర్వాత పునరావాసం ఖర్చు పదిరెట్లు పెరిగి రూ.34 వేల కోట్లకు చేరిపోయిందన్నారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చునని, అయితే ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తర్వాత నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుందని, ఇప్పుడు ఎందుకు తిరిగిచ్చేస్తామని చెపుతున్నారనేది తనకు అర్ధం కావటంలేదన్నారు. భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు అవకతవకలో ఆరోపణలు రావడం సర్వసాధారణమేనని, అయితే మన జవాబుదారీతనాన్ని, పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్లే తాను పోలవరంపై శే్వతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తే సరిపోయేదానికి రకరకాల అంశాలను తీసుకువచ్చి కేంద్రానికి అనుమానాలు వచ్చే అవకాశం ఇస్తున్నారన్నారు. పారదర్శకంగా ఉండకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

చిత్రం.. పోలవరం ప్రాజెక్టు పురోగతిని పవన్ కళ్యాణ్‌కు వివరిస్తున్న ఇంజనీరింగ్ నిపుణులు