ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థినిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, డిసెంబర్ 7: విశాఖపట్నం జిల్లాలో విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గూడెంకొత్తవీధి మండలం, పెదవలస పంచాయతీ పరిధిలో చాపరాతిపాలెం గ్రామానికి చెందిన గిరిజన బాలిక చింతపల్లిలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గూడెంకొత్తవీధి మండలం ఏకలవ్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన బావను చూసేందుకు గత నెల 26న మధ్యాహ్నం పాఠశాలకు వెళ్ళింది. పాఠశాల వసతి గృహంలో తన బావతో కలిసి మాట్లాడుతుండగా అక్కడ అసిస్టెంట్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న వెంకట రామకృష్ణ వచ్చి బాలిక బావను బెదిరించి బయటకు పంపించేశాడు. తర్వాత ఆ బాలికను ఆ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. అత్యాచారం వలన తీవ్ర రక్తస్రావం జరగడంతో కుటుంబీలకు చెప్పినట్టు బాధితురాలు పేర్కొంది. ఫిర్యాదు అందిందని, విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు.