ఆంధ్రప్రదేశ్‌

శేషాచలం అడవుల్లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, డిసెంబర్ 7: కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో తమిళ కూలీలు, స్మగ్లర్లు బరి తెగించారు. గురువారం టాస్క్ఫోర్స్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరిపారు. జిల్లా సరిహద్దు గ్రామాలైన కుక్కలదొడ్డి, మామండూరు సమీపంలోని శేషాచలం అడవుల్లో రైల్వేకోడూరు, తిరుపతికి చెందిన ప్రత్యేక క్యాంపుల టాస్క్ఫోర్స్ పోలీసులు 9 మంది కూంబింగ్ నిర్వహిస్తుండగా వంద మందికి పైగా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు కనిపించారు. ఎర్రచందనం దుంగలను తరలించుకుపోతుండగా గమనించిన టాస్క్ఫోర్స్ సిబ్బంది నిలువరించారు. దీంతో ఎర్రకూలీలు, స్మగ్లర్లు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రాణరక్షణ కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. కూలీలు దుంగలను వదిలేసి అడవిలోకి పారిపోయారు. కడప, చిత్తూరు జిల్లాల ప్రత్యేక పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఐజీ కాంతారావు సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కూలీలు వదిలివెళ్లిన 150 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్లు, తమిళకూలీల కోసం గాలింపు ఉద్ధృతం చేశారు. కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది కూలీలను పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.