ఆంధ్రప్రదేశ్‌

కొత్త జిల్లాలపై పుకార్ల షికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. తెలంగాణ తరహాలో రాష్ట్రంలో కూడా మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఇలాంటి ప్రతిపాదనేమీ లేదని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని కూడా 26 జిల్లాలుగా విభజించనున్నారని, సంక్రాంతికి ఈ జాబితా ఖరారు చేసి ప్రకటించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. కొత్తగా ఏర్పాటు కానున్నాయంటూ జిల్లాల వివరాలను కూడా అందులో పొందుపరచడం విశేషం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా పాలకొండ, పార్వతీపురం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, గుడివాడ, మచిలీపట్నం, నంద్యాల, అరకు, పులివెందుల, తిరుపతి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నారనేది పుకారు. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అధికార వర్గాలు దీన్ని కేవలం పుకార్లేనని కొట్టిపారేశాయి. ఇలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అవి పుకార్లు మాత్రమేనని పేర్కొంటున్నాయి. గతంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘ఆంధ్రభూమి’ ప్రస్తావించగా.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంకా అనేక సమస్యల్లో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉందని, ఈ తరుణంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల అదనంగా మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నాడు ఆయన స్పష్టం చేయటం ఈ సందర్భంగా గమనార్హం.