ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌టీటీపీఎస్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: విజయవాడ నగర సమీప ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్‌టీటీపీఎస్)లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7వ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్ ఆదివారం పేలిపోయింది. దీంతో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడటంతో కార్మికులు, ఇంజనీర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 4 దశలలో ఏడు యూనిట్ల నుండి 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. 1వ యూనిట్ 210 మెగావాట్ల ఉత్పత్తినినిలిపివేశారు. 2వ యూనిట్210 మెగావాట్ల సామర్థ్యం కలిగినది కాగా వార్షిక మరమ్మతులు, 6వ యూనిట్ 210 మెగావాట్లు జనరేటర్ పేలటంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదివారం 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ దశ 7వ యూనిట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవటంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం 3, 4, 5వ యూనిట్లలో మాత్రం 630 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని చీఫ్ ఇంజనీర్ పద్మసుజాత, అధికారులు చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతులకు చర్యలు చేపట్టారు.

చిత్రం..ఎన్‌టీటీపీఎస్‌లో ఆదివారం ట్రాన్స్‌ఫార్మర్ పేలటంతో దట్టంగా కమ్ముకున్న పొగ
ఇన్‌సెట్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రం 7వ యూనిట్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్