ఆంధ్రప్రదేశ్‌

పాత పెన్షన్ విధానం కోసం ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలోని లక్షా 80 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు పాత పెన్షన్ విధానం కొనసాగించాలనే డిమాండ్‌పై ఇక ప్రత్యక్ష పోరుకు సన్నద్ధం కావాలని ఆదివారం నాడిక్కడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాక్టో, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లారుూస్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన విస్తృత సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పాత పెన్షన్ విధానం కొనసాగింపు రాష్ట్రాల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో బొప్పరాజు అన్నారు. ఉద్యోగ సంఘాల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసి రెండు మాసాలు గడుస్తున్నా నేటికీ విధివిధానాలు రూపొందించక పోవటాన్ని సమావేశం గర్హించింది. ఇప్పటికే మరణించిన 250 మంది ఉద్యోగుల కుటుంబాలు ఈ విధివిధానాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నాటి ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించకపోవడం వల్లనే నేటికీ సీపీఎస్ విధానం కొనసాగుతోందని అన్నారు. పాత పెన్షన్ విధానం కోసం రాష్ట్రంలోని 10 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఇక ఏకమై పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నిర్ణయమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకారం ఈ నెల 21న సీపీఎస్ ఉద్యోగ సంఘ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్తదానం, పండ్ల పంపిణీ, జనవరిలో మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఒకరోజు ధర్నా, మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో మంత్రులు, శాసనసభ్యుల నివాసాల ముట్టడి, తరువాత రాష్ట్ర శాసనసభ ముట్టడి, దానికి ముందుగా రిలే దీక్షలు, మే నెలలో కలెక్టర్ కార్యాలయాల ముట్టడి, మే, జూన్ నెలల్లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించడంలో చేయూత వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. సమావేశంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి రామాంజనేయులు, జేఏసీ సెక్రటరీ జనరల్ టీవీ ఫణి పేర్రాజు, జాక్టో ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.