ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్లతో బీసీలకు నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 10: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వెనుకబడిన వర్గాలకు ఏ విధమైన నష్టం వాటిల్లదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మాత్రమే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించి తమ అధినేత చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ఆదివారం అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) పేద విద్యార్థులకు ఉపకార వేతనాలందించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్యనందించడానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల వంతున సహాయమందిస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాపు కార్పొరేషన్ల ద్వారా ఆయా పథకాలను అమలుచేస్తోందని చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందించడానికి ఉచిత వసతి, శిక్షణ కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. ఇటీవల కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి యువ పారిశ్రామికవేత్తలను తయారుచేస్తోందని, ఎన్టీఆర్ విదేశీ విద్యోన్నతి పథకంతో కాపు విద్యార్థులకు విదేశాలలో విద్యనభ్యసించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఆప్తా ప్రతినిధులు విదేశాలలో స్థిరపడినప్పటికీ స్వంత గడ్డను మరువకుండా ఇక్కడి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తుండటం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తోన్న ఆప్తా సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థలను చినరాజప్ప కోరారు. సంస్థ ప్రతినిధి ప్రియాంక ఆప్తా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలోఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు కాకినాడ నగర మేయర్ సుంకర పావని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎపిఎస్‌పి అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర, ఆప్తా బోర్డు డైరెక్టర్లు రాజేష్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రతిభావంతులకు ‘ఆప్తా’ ఉపకార వేతనాలు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప