ఆంధ్రప్రదేశ్‌

ఇకపై కంప్యూటర్ బేస్డ్ టెస్టుగా టెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అర్హత టెస్టు (టెట్)ను ఇకపై కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ)గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017-18 సంవత్సరం నుంచి అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టులుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరీక్షను కూడా అదే తరహాలో నిర్వహించనున్నారు. పరీక్షలో అన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుగా ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ఒకటి నుంచి 5వ తరగతి వరకూ ఉపాధ్యాయులుగా వెళ్లే వారి కోసం టెట్ పేపర్ -1ను, 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా వెళ్లాలనుకునే వారి కోసం టెట్ పేపర్-2 నిర్వహిస్తారు. రెండింటికీ ఉపాధ్యాయునిగా వెళ్లాలనుకుంటే రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపరు 150 మార్కులకు 2.30 గంటలు పాటు ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్కులను జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతంగా నిర్ణయించారు. టెట్ ఉత్తీర్ణతా సర్ట్ఫికెట్లు ఏడు సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతాయి. టెట్ నిర్వహణను పర్యవేక్షించేందుకు వీలుగా పాఠశాల విద్య కమిషనర్ చైర్మన్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. టెట్‌ను జూన్/జూలై, ఆగస్టు/సెప్టెంబర్‌లో రెండుసార్లు నిర్వహించనున్నారు. ఎంసెట్ తరహాలో ఆన్‌లైన్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు వంటివి ఈ విధానంలో కూడా అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపికను టెట్ కమిటీ ఖరారు చేస్తుంది. ఒక్కో కేంద్రంలో 5000 మంది ఓకేసారి పరీక్ష రాసేందుగా వీలుగా కేంద్రాలను ఎంపిక చేస్తారు. ఐఐటి జెఇఇ, తదితర పరీక్ష కేంద్రాలను టెట్ కేంద్రాలుగా ఎంపిక చేస్తారు.