ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా 80 ఎయిర్‌పోర్టుల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: విమానయానాన్ని అందిరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. వరల్డ్ బర్డ్‌స్రైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బర్డ్, వైల్డ్‌లైఫ్ స్ట్రైక్ ప్రివెన్షన్ ఏవియేషన్ సేఫ్టీ అన్న అంశంపై విశాఖలో సోమవారం జరిగిన సౌత్ ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఖ్యాపరంగా చూస్తే ప్రస్తుతం భారత్ విమాన ప్రయాణీకుల చేరవేతలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం భారత్‌లో చిన్నా,పెద్దా కలిపి 71 విమానాశ్రయాలు ఉన్నాయని, కొత్తగా మరో 80 విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిలో ఇప్పటికే 14 ఎయిర్‌పోర్టులు నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మిగిలిన వాటిలో అత్యధిక భాగం వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. నీటిలోను, నేలపైన దిగే విధంగా రూపొందించిన ఉభయచర విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చే అలోచన ఉందన్నారు.
ఇటీవల ముంబైలో ఈ విధమైన విమానాన్ని విజయవంతంగా ప్రయోగించామన్నారు. అహ్మదాబాద్, విజయవాడల్లో కూడా వీటిని ప్రయోగాత్మకంగా నడపనున్నట్టు తెలిపారు. భారతదేశంలో సుమారు 7,500 కిమీ మేరకు తీర ప్రాంతంతోపాటు నదీ వనరులు ఉన్నాయన్నారు. ఉభయచర విమానాలు పర్యాటకానికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. ఎయిర్‌కార్గోను ప్రోత్సహించేందుకు పౌర విమానయాన శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిలో భాగంగానే భారత ప్రభుత్వం, ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కార్గో డివిజన్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇటీవల విశాఖలో ఎయిర్ కార్గోను ప్రారంభించామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు