ఆంధ్రప్రదేశ్‌

కోడిపందాలు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 11:రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని శాంతి భద్రతలను కాపాడుతున్నామని రాష్ట్ర హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. సోమవారం ఒంగోలులోని ఎస్‌పి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో దొంగతనాలు జరగకుండా సిసికెమెరాలు, డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకోసం సరైన ప్రాంతాల్లో పోలీసు అధికారులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కోడిపందాలను నిషేధించామన్నారు. అందుకు విరుద్దంగా నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో దొంగతనాలు, గొలుసుదొంగతనాలు గతసంవత్సరం కంటే ఈసంవత్సరం బాగా తగ్గాయన్నారు. రాష్ట్రంలో రోడ్డుప్రమాదాలను జీరోశాతం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రకాశం జిల్లాలో దొంగతనాల రికవరి శాతం 72 శాతం చేశారన్నారు. ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు పనితీరు బాగుందని ప్రసంశించారు. ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో ప్రశాంతవాతావరణం ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాప్రశాంతంగా ఉంటేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈవిలేఖర్లసమావేశంలో జిల్లాఎస్‌పి బి సత్యఏసుబాబు, అదనపు ఎస్‌పి ఉదయరాణి, డిఎస్‌పిలు, సిఐలు పాల్గొన్నారు.
అంతకుముందు ఒంగోలులోని ఫేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిస్ అండ్ సైన్స్‌స్ కాలేజిలో ఏర్పాటుచేసిన నాల్గవ ఆంధ్రప్రదేశ్ అంతర్‌జిల్లా అండర్ -23, సీనియర్స్ పెన్సింగ్ చాంఫీయన్ షిప్ -2017ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.