ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడను బేషరతుగా విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షను భగ్నం చేసి, ఆయన్ను అరెస్టు చేసిన ప్రభుత్వం, బేషరతుగా ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆలిండియా కాంపు సంఘం డిమాండ్ చేశారు. ముద్రగడ అరెస్టు నేపథ్యంలో సంఘం రాజధానిలో గురువారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కాపు నాడు అధ్యక్షులు కటారి అప్పారావు మాట్లాడుతూ ఆయనపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకుని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా బంద్‌కు వచ్చిన పిలుపుకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న ముద్రగడ్డను అరెస్టు చేసి, కేసులు పెట్టడం దారుణం అన్నారు. ముద్రగడ ఆందోళనకు సంఘీభావంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రిలే నిరహారదీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. సిఎం చంద్రబాబు కాపులపై కక్ష కట్టారని ఆరోపించారు. ఆందోళను మరింత ఉద్దృతం చేసేందుకు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేస్తామన్నారు. ఆలిండియా కాపు సంఘం అధ్యక్షుడు పెద్దకాపు వినయ్ మాట్లాడుతూ చంద్రబాబు ముద్రగడకు క్షమాపణ చెప్పి, వెంటనే విడుదల చేయాలన్నారు. దేశంలో లేని చట్టాలను సైతం కాపులపై పెట్టి, ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడకు ఏదైనా అపాయం కలిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలెదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు న్యాయవాది సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.