ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ దీక్షలకు భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 9: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షలకు ప్రభుత్వం భయపడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కాపులను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై విరుచుకు పడ్డారు. చీటికిమాటికీ ఉద్యమాలు, దీక్షలు చేపడుతున్నారని, వీటికి తాము తలవంచే ప్రసక్తేలేదన్నారు. కడపలో గురువారం విలేఖరులతో మాట్లాడిన చంద్రబాబు తుని రైలు ఘటన దోషులపై చర్యలకు వెనుకాడేది లేదన్నారు. తుని దోషుల అరెస్టుకు నిరసనగా చేపట్టిన ముద్రగడ దీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచేది లేదని తెలిపారు. తునిలో అత్యంత దారుణ సంఘటనలు జరిగాయని పేర్కొన్న చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ముద్రగడ వ్యహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టం తనపని తాను చేసుకు పోతుందని ఉద్ఘాటించారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, అలాగే కార్పొరేషన్ ద్వారా కాపులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మంజునాధ్ కమిటీ నివేదిక అనంతరం కాపులను బిసిల్లో చేరుస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కాపులంతా సంయమనం పాటించాలని సిఎం పిలుపునిచ్చారు. ముద్రగడ దీక్షకు ఎవరూ హాజరుకావద్దని, రాష్ట్రంలోని ప్రతి కాపు సోదరునికి తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కాపులకు ముద్రగడ ఏమి ఒరగబెట్టారో ఓమారు ఆలోచించాలన్నారు. కాపులను బిసిల్లో చేర్చే చర్యలు వేగవంతం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం మెడపై కత్తిపెట్టే విధంగా ముద్రగడ వ్యవహరించడం సబబుకాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, కార్యకర్తలకు తుని సంఘటనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉందని సిఎం ఆరోపించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని, గూండాగిరీ, దాదాగిరీ చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్వరంతో అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తే జగన్మోహన్‌రెడ్డిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశం శాంతియుతంగా, ప్రశాంతంగా ఉండేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేస్తుంటే ప్రతిపక్షనేత జగన్ అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు ప్రజల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారని పేర్కొన్న బాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తేలేదని అన్నారు.

చిత్రం కడపలో విలేఖరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు