ఆంధ్రప్రదేశ్‌

బీసీలను బానిసలుగా చూస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: చంద్రబాబు పాలనలో బీసీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని వైకాపా బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యుల మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారన్నారు. గ్రామాల్లో బీసీలను బానిసలుగా మార్చేసారని విమర్శించారు. బీసీలకు టీడీపీ అన్ని రకాలుగా అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పారు. గ్రామస్థాయిలో బీసీల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. బీసీలకు న్యాయం చెయ్యాలన్న జగన్ ఆదేశాలతో అధ్యయన కమిటీ రాష్ట్ర పర్యటనకు వెళుతోందని వెల్లడించారు. అధ్యయనం అనంతరం జగన్‌కు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు. నివేదిక ఆధారంగా బీసీ గర్జనలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. మాజీ మంత్రి కొలుసు పార్దసారది మాట్లాడుతూ బీసీ వర్గాలకు వైకాపా తరుపున పూర్తి భరోసాను కల్పిస్తామన్నారు. బీసీలకు ఇచ్చే హామీలన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అమలు చేస్తామన్నారు. తెదేపా ప్రభుత్వం బీసీలకు ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎంత ఖర్చు చేసింది అనే దానిపై శే్వత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చాక బీసీల కోసం ఖర్చు చేసింది అతిస్వల్పమన్నారు. తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల మెడలు వంచి కేటాయించిన నిధులు ఖర్చు చేసేలా చూడాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బీసీనేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, బూరె నర్సగౌడ్, జోగి రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.