ఆంధ్రప్రదేశ్‌

భవానీలకు మరిన్ని సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భవానీ దీక్షాదారులు దీక్షలు విరమించి మొక్కులు చెల్లించుకోవడానికి దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారని, వారికి సౌకర్యాలు కల్పించటంలో అశ్రద్ధ చూపించవద్దని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక పద్మావతి ఘాట్, దుర్గా ఘాట్లలో వసతులను పరిశీలించారు. ఉదయం ఈ ఘాట్లలో ఉన్న సౌకర్యాలను, భక్తులకు ఏర్పాటు చేసిన వసతులను మంత్రి పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన సూచనలను అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుర్గ్భావానీలకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా తగిన వసతులను కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు భవానీలకు అందుతున్న వసతులను పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం మంత్రి దుర్గాఘాట్‌లో భవానీలు స్నానమాచరించే ప్రదేశాల్లో నీళ్లు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు. భవానీల కోసం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రంలో ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయో ఘాట్లలో కలియతిరుగుతూ ఎలా అందుతున్నాయో పరిశీలించారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన సమాచార కేంద్రంలో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. భవానీలకు ఏ విధమైన అత్యవసర వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో అనే విషయాలను పరిశీలించేందుకు ఇక్కడ ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కూడా మంత్రి సందర్శించి ఉన్న మందులను పరిశీలించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ తగిన వసతులు ఏర్పాటుచేసి భవానీలకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, అధికారులు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.