ఆంధ్రప్రదేశ్‌

ఏపి అభివృద్ధిపై డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి దిశ, దశ మార్గనిర్దేశనం చేసే లక్ష్యంతో రానున్న 34 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఒక డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలు, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని ఒక డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేస్తుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌తో కలిసి రూపొందించే ముసాయిదా డాక్యుమెంట్‌ను ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రజా బాహుళ్యంలో పెట్టనున్నారు. 1995- 2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు 2020 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి విడుదల చేశారు. 12 సంవత్సరాల క్రితం ఈ డాక్యుమెంట్ ప్రజాదరణ పొందిన విషయం విదితమే. ఆ తర్వాత చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి చెందడం, రాష్ట్ర విభజన జరగడంతో ఆ డాక్యుమెంట్‌కు కాలదోషం పట్టింది. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలంటే ఏమి చేయాలన్న లక్ష్యంతో పలు మార్గదర్శక సూత్రాలను కొత్త డాక్యుమెంట్‌లో నిర్దేశిస్తారు. 2022 నాటికి మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటి, 2029 నాటికి మొదటి రాష్ట్రంగా, 2020 నాటికి ప్రపంచంలోనే అన్ని దేశాలను పెట్టుబడులను ఆకర్షించే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌లో పలు కీలకాంశాలను పొందుపరచనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు పలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అమరావతితో పాటు తిరుపతి, కర్నూలు, కడప, కాకినాడలో ఈ డాక్యుమెంట్‌పై చర్చా గోష్ఠులను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 13 రంగాలకు సంబంధించి అభివృద్ధి సూచికలు, లోపాలకు సంబంధించి గణాంక వివరాలతో వాస్తవ, వ్యూహాత్మక విధాన పత్రాలను రూపొందిస్తున్నారు. పరిశ్రమలు, ఆర్థిక రంగం, వౌలిక సదుపాయాలు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, వాతావరణంలో మార్పులు, జలాలు, సామాజిక సంక్షేమ రంగాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను నిపుణులు అధ్యయనం చేశారు. దాదాపు 113 సూచికలను ప్రాతిపదికగా తీసుకుని ఈ డాక్యుమెంట్‌ను ఖరారు చేస్తారు. తలసరి ఆదాయం, మానవ వనరుల అభివృద్ధి సూచికను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు చెందిన నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావుల అభిప్రాయాలను సేకరించి ఈ డాక్యుమెంట్‌ను ఖరారు చేస్తారు.