ఆంధ్రప్రదేశ్‌

ఎకనమిక్ సిటీపై నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: కీలక ప్రాజెక్టుల అమల్లో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో విభాగాధిపతులతో మంగళవారం జరిగిన సమావేశంలో విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో ఏర్పాటు చేయనున్న ఎకనామిక్ సిటీ నిర్మాణం గురించి ఆరా తీశారు. దీని నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి, ఎంఎస్‌ఎంఇ ఏర్పాటుకు స్థలం ఇబ్బంది లేదని మంత్రి నారాయణ తెలిపారు. కేటాయించిన స్థలంలో కొండ ఉందన్నారు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ 235 ఎకరాలు కేటాయించామని, పక్కననున్న కొంత భూమిని భూ సమీకరణ చేయాల్సి ఉందన్నారు. భూసమీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుందని మంత్రి చెప్పారు. ముందుగా 235 ఎకరాల్లో పనులు ప్రారంభిస్తే, ఈ లోగా ఆ భూమిని సమీకరించవ్చదని కలెక్టర్ తెలిపారు. కొండ గ్రావెల్ తమకు అవసరమని సీఆర్‌డీఏ అధికారులు చెప్పారని, అందువల్ల వారు తొలగిస్తారన్నారు. దీనిపై మంత్రి జోక్యం చేసుకుని ఆ గ్రావెల్ తక్కువ నాణ్యత ఉందని చెప్పారన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ, అధికారులు థియరీ కన్నా, క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు. అన్ని తానే చేయాలంటే ఎలా? సమస్యలు పరిష్కరించేవాడే నాయకుడు అవుతాడని, లేకుంటే కాలగర్భంలో కలుస్తారని వ్యాఖ్యానించారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఎకనామిక్ సిటీ నిర్మాణంలో ఇబ్బందులు ఉంటే సరైన రీతిలో ఎదుర్కోవాలని అధికారులకు హితవు పలికారు. తాను పోలవరం గురించి రాత్రింబవళ్లు కష్టపడటం లేదా? అని వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ పనులు జరుగుడం లేదని, తనకు ధియరీ చెప్పవద్దని ముందే చెప్పానని గుర్తు చేశారు.