ఆంధ్రప్రదేశ్‌

నెపాన్ని ఒడిశాపై నెట్టేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పట్లో రాకపోవచ్చు. విభజన చట్టంలో ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. దీనిపై గడచిన మూడు సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ జోన్ విజయవాడలో ఏర్పాటు చేయాలా? విశాఖ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి, విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయా లా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత లేని ప్రకటనలు చేస్తూ వచ్చింది. అంతేకాకుండా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడానికి ఒడిశా ప్రభుత్వం అడ్డుపెడుతోందంటూ అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. అయితే, సాక్షాత్తూ రైల్వే బోర్డు చైర్మన్ బుధవారం విశాఖ వచ్చి, జోన్ ఏర్పాటుకు ఒడిశా నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని కుండ బద్దలుకొట్టేశారు.
రాష్ట్రానికి రైల్వే జోన్ వస్తుంది కానీ, అది ఎక్కడన్నది చెప్పలేమంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు సహా, ఈ ప్రాంత ఎంపీలంతా చెప్పుకొచ్చారు. జోన్ ఉద్యమం వేడెక్కినప్పుడు అధికార పార్టీ ఎంపీలు అంతా ఏకమై, విశాఖకే జోన్ వస్తుందని జనాన్ని నమ్మించేవారు.
ఈ జోన్ తమకే కావాలని విజయవాడ ప్రాంతవాసులు కొంత కాలం కిందట ప్రభుత్వాలపై వత్తి డి పెంచారు. కానీ, ఏడాది కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి, రైల్వే జోన్ విశాఖకే వస్తుందని స్పష్టం చేశారు. ఆ తరువాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అప్పటికి రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకు పంపించి, జోన్ వేగాన్ని పెంచాలని సీఎం భావించారు. సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నికైన వెంటనే, మోదీ ఆయన శాఖను మార్చేశారు. అప్పటి నుంచి రైల్వే జోన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లూప్ లైన్‌లోకి నెట్టేశాయి.
తాజాగా మళ్లీ జోన్ అంశం తెర మీదకు వచ్చింది. దీనిపై బీజేపీ, టీడీపీలు ఎటువంటి ప్రకటన చేయకుండా, ముఖం చాటేస్తున్నారు.
వాస్తవం ఇదీ!విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని విశాఖ వాసులు ఇక ఆశపడనక్కర్లేదు. జోన్ వెనుక పెద్ద రాజకీయ కుట్ర నడుస్తోందని రాజకీయ వర్గాలే చెపుతున్నాయి. ఇప్పటి వరకూ విశాఖకు జోన్ వస్తుందనే చెపుతున్న నాయకులే నెమ్మది నెమ్మదిగా ఈ కుట్రను బయటపెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒడిశాలో బీజెపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని మోదీ భావిస్తున్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను అక్కడ సీఎంగా చేయాలన్న ఆలోచనలో మోదీ ఉన్నారని మన నేతలే చెపుతున్నారు. రైల్వే జోన్‌పై ఇటు విశాఖ వాసులకు, అటు ఒడిశా ప్రజలకు సమానమైన సెంటిమెంట్లే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగా ఉన్న టీడీపీని జోన్ విషయంలో జోకొట్టి, పగ్గాలు చేపట్టాలనుకుంటున్న ఒడిశా ప్రజలకు జోన్‌ను ఎరేసి, ఒడిశా ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది మోదీ వ్యూహమని చెపుతున్నారు. ఇదే నిజమైతే, విశాఖకు సమీప భవిష్యత్‌లో రైల్వే జోన్ వచ్చే అవకాశం లేదని ఖాయంగా చెప్పచ్చు. విశాఖకు జోన్ వచ్చేస్తోందని మన నేతలెవరైనా చెపితే, ఆ మాటల్లో వాస్తవం లేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి.