ఆంధ్రప్రదేశ్‌

శిరోముండనం కేసు విశాఖ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో దళితుల శిరో ముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వకుండా హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ సంఘటన 1997లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఈ కేసులో బాధితులు కోటి చినరాజు మరో ఇద్దరు తాము ఎస్సీ వర్గానికి చెందినవారమని, రెవెన్యూ అధికారులు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. గతంలో హైకోర్టు రెవెన్యూ అధికారులు పిటిషనర్లకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇవ్వాలని, అలాగే ఈ ధృవపత్రాల వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సాక్ష్యం కింద ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు ఈకేసును కోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుల ధృవీకరణ పత్రాలను విచారణ కోర్టుకు ఇవ్వలేదన్నారు. రాజకీయ వత్తిళ్ల వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ ధృవపత్రాలను కోర్టుకు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉన్నారన్నారు. ఈ కేసులో కుల ధృవపత్రాలు కీలకమైనవన్నారు. ఈ ధృవపత్రాలు ఇవ్వని పక్షంలో విచారణ కోర్టు ఎదుట కేసు నిలబడదన్నారు.
ఈ సందర్భంగా నిందితుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తరఫున న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా, బాధితుల తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కులధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా వాదనలు చేశారని, దీంతో విచారణ కోర్టు ఈ నెల 14వ తేదీన తీర్పు వెలువరిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అనంతరం విశాఖపట్నం 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసుపై తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తీర్పును వెలువరించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసింది.