ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ నిధులు విడుదలకు కేంద్రం ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు రూ.800 కోట్లను త్వరలోనే కేంద్రం విడుదల చేస్తుందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించానని, ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గడ్కరీతో సమావేశం అనంతరం చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన రూ.2574కోట్ల విలువైన పెండింగ్ బిల్లులను కేంద్రానికి అందించినట్టు చెప్పారు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.318కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. భూ సేకరణ పునరావాసానికి సవరించిన అంచనాలు కేంద్రానికి అందించనున్నట్టు వెల్లడించారు. ఇది చాలా పెద్ద పునరావాస ప్యాకేజీ అని, దీనివలన సుమారు 95వేల కుటుంబాలకు పునరావాసం, భూసేకరణ కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి గడ్కరీ రాజమండ్రి వచ్చి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని చెప్పారు. ఇద్దరం కలిసి ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సవరించిన అంచనాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. 2018 నాటికల్లా ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై గడ్కరీకి స్పష్టమైన అవగాహన ఉందని, సకాలంలో ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు.