ఆంధ్రప్రదేశ్‌

జూపార్కుకు చేరిన ఏనుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ (విశాఖ), డిసెంబర్ 13: సెంట్రల్ జూ అథారిటీ సూచనల మేరకు మహారాష్టల్రోని ఔరంగాబాద్ జూపార్కు నుంచి తరలించిన రెండు ఆడ ఏనుగులు విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు బుధవారం చేరాయి. సీనియర్ పశువైద్య నిపుణుడు నవీన్ పర్యవేక్షణలో మావటీలు ఇక్కడకు వీటిని రెండు ట్రక్కుల్లో తెచ్చారు. ట్రక్కుల నుంచి దించిన ఏనుగులను విశాలమైన మోటులో ఉంచారు.
వచ్చిన రెండు ఏనుగుల్లో ఒకటి ముసలిదని, పేరు సరస్వతి (52), మరొకటి దీనికే పుట్టిన పిల్లని, పేరు లక్ష్మి (22)అని జూ క్యూరేటర్ బి.విజయ్‌కుమార్ తెలిపారు. ఏనుగులున్న జూపార్కు విశాలంగా ఉండడంతో పాటు, నిపుణులైన వైద్యు ల పర్యవేక్షణలో ఉంచాలన్న నియమం ఉంది. ఔరంగాబాద్ జూపార్కు ఇరుకుగా ఉండడం, సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో సెంట్రల్ అథారిటీ, ఏనుగులు ఉంచడానికి అన్ని సౌకర్యాలున్న విశాఖ జూపార్కుకు తరలించాలని ఔరంగాబాద్ జూపా ర్కు అధికారులకు సూచించడంతో ఇక్కడకు తరలించారని విజయ్‌కుమార్ తెలిపారు. కాగా, ఇందిరాగాంధీ జూ పార్కులో 48 ఏళ్ల కృష్ణ అనే ఏనుగు, 12 ఏళ్ల రాజు అనే గున్న ఏనుగు ఉన్నాయి. ఈ నాలుగు ఏనుగులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి.