ఆంధ్రప్రదేశ్‌

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 13: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నేరస్థులు కొత్త సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారని, వారిని నియంత్రించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు యంత్రాంగానికి అన్ని వసతులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వీటికి నాలుగు కోట్ల 30లక్షలు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నగరంలో పోలీసులకు వసతికి ఇబ్బందిగా ఉండేదని, కాని దీన్ని ఇప్పుడు అధిగమించడం సంతోషకరమన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో పోలీసులకు వసతి గృహ సముదాయాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. దీంతోపాటు డిజిపి కార్యాలయంలో క్యాంటీన్‌ను కూడా ప్రారంభించి ఆవరణలో టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు ఆధ్వర్యాన డిజిపి నండూరి సాంబశివరావు, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావులతో కలిసి ఎర్ర చందనం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు అదుపులో ఉండటం ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు రావడంలో పోలీసు పాత్ర ప్రశంసనీయమన్నారు. త్వరలోనే ఫారెస్ట్ ల్యాండ్‌కు సంబంధించి అనుమతులు రానున్నాయని, తద్వారా పోలీసులకు ఇళ్ళ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. మంగళగిరిలోని ఏపిఎస్‌పి ఆరో బెటాలియన్ ఇక్కడే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
సిబ్బందికి ఏబీసీడీ అవార్డులు
కేసులను ఛేదించడంలో విశేష ప్రతిభ కనపరిచిన సిబ్బందిని గుర్తించి ప్రతి మూడు మాసాలకు ఇచ్చే ఏబీసీడీ అవార్డులు మంత్రి, డీజీపీ చేతుల మీదుగా అందచేశారు. కనిగిరి సిఐ ఎం సుబ్బారావుకు ప్రథమ అవార్డు, పుంగనూరు సిఐకి ద్వితీయ, గూడూరు సిఐకి తృతీయ బహుమతులు దక్కాయి. అదేవిధంగా ఐపిఎస్ అవార్డులకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టుకు పిఎస్ శివకుమార్, ఎం బాలకృష్ణ, ఎం రమేష్, బి వరప్రసాద్ అనే కానిస్టేబుళ్ళకు అందచేశారు. రెండో బహుమతిని ఏఎస్‌ఐ జి రఘురామయ్య, కానిస్టేబుళ్ళు టి రాజగోపాల్, సిహెచ్ జోబ్‌లకు బహుకరించారు. మూడో బహుమతిని కానిస్టేబుల్ ఏ శ్రీనివాసులకు అందచేశారు. సెప్టెంబర్ మాసానికిగాను హెడ్ కానిస్టేబుల్‌ఖ జెవిఎల్‌ఎస్ రాధాకృష్ణకు మొదటి, హెడ్ కానిస్టేబుల్ డి సత్తిరెడ్డికి రెండో, ఏ లక్ష్మీనారాయణకు మూడో, కానిస్టేబుళ్ళు ఎస్ రామ్మోహన్, పి రామాంజనేయులుకు అందచేశారు. ఏబిసిడి, ఐపిఎస్ అవార్డుల వల్ల సిబ్బందిని తగిన విధంగా ప్రోత్సహించిన వారమవుతామని ఈసందర్భంగా డిజిపి పేర్కొన్నారు. అనంతరం 13 జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో డిజిపి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల్లో చైతన్యం కలిగించేందుకు 1200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టిన నలుగురు మహిళలను డిజిపి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావు, అదనపు డిజిపిలు ద్వారకా తిరుమలరావు, హరీష్‌కుమార్ గుప్తా, ఎన్‌వి సురేంద్రబాబు, విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.