ఆంధ్రప్రదేశ్‌

తిండి లేక నేలకొరుగుతున్న సైబీరియన్ పక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 9: కరవు సీమలో పక్షులకూ ఆహారం కొరత ఏర్పడింది. వేల కిలోమీటర్ల దూరం నుంచి సంతానోత్పత్తి కోసం అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం చేరుకునే ఎర్రమూతి (సైబీరియన్) కొంగలు తిండి దొరక్క మృత్యువాతపడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ఈసారి వీరాపురం చెరువుతో పాటు పరిసరాల్లోని కుంటల్లో నీళ్లు అడుగంటాయి. ఫలితంగా చేపలు పెంచలేదు. దీంతో తినేందుకు చేపలు లేక, తాగేందుకు నీళ్లు దొరక్క కొంగలు ఒక్కొక్కొటిగా చనిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 25 కొంగలు చనిపోయాయని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటల్లో నీరు చేరడంతో దాహం తీర్చుకుంటున్నాయి. ఏటా వీరాపురం వచ్చే విదేశీ అతిథులకు ఆహారం , నీటి వసతి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే వచ్చే ఏడాది ఎర్రమూతి కొంగలు ఇటువైపు రావని వారంటున్నారు.

చిత్రం తిండి లేక చనిపోయిన సైబీరియన్ కొంగ