ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌టీఐ వడపోత వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 13: సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఎంపిక సమావేశంలో భాగస్వామి అయిన, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశానికి హాజరుకానందుకే సమావేశం వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఆర్‌టీఐ తొలిసారి ఏర్పాటుకానుంది. ఇప్పటివరకూ దీన్ని ఏర్పాటుచేయకపోవడంతో, కోర్టు ఆదేశం మేరకు ఏపీ ఈ ప్రక్రియను చేపట్టగా, తెలంగాణ ప్రభుత్వం ఈపాటికే నియామకాలు పూర్తి చేసింది. ఇదిలాఉండగా, ఇప్పటివరకూ ఆర్‌టీఐ కమిషనర్ల కోసం 318 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. 299 మంది నేరుగా దరఖాస్తు చేసుకోగా, మిగిలిన 19 మంది వేరే రూపంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.కె.పరీడా కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఆర్‌టీఐ చీఫ్ కమిషనర్ రేసులో మాజీ డీజీపీ జాస్తి వెంకట రాముడు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం పేరు కూడా వినిపిస్తోంది. వివిధ రంగాలకు చెందిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత హాజరుకాకపోవడంతో, సమావేశం తిరిగి ఎప్పుడు ఏర్పాటుచేసేదీ తర్వాత ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే జగన్ పాదయాత్రలో ఉన్నందున, ఆయన తన ప్రతినిధిగా మరొకరిని పంపిస్తారని వైసీపీ నేతలు చెప్పారు.